NewsOrbit
Featured రాజ‌కీయాలు

సీబీఐకి మరో పెద్ద కేసు..? చంద్రబాబు, లోకేష్ పై జగన్ కొత్త ఎత్తు..!

ఏపీ సీఎం జగన్ దూకుడుమీదున్నారు .., అటు సంక్షేమాలిస్తూనే.., ఇటు ప్రత్యర్థులను కిందికి దించేస్తున్నారు..!! అక్కడితో ఆగడం లేదు. ఆగితే ఆయన జగన్ ఎందుకు అవుతాడు..!! టీడీపీ ఇరుకున పెడుతున్నాడు.., ఎమ్మెల్యేలను లాగేస్తున్నాడు.., పార్టీని బలహీనం చేస్తున్నాడు.., టీడీపీని నిలువునా ముంచేస్తున్నాడు..! ఇక్కడితోనూ ఆగడం లేదు. సీబీఐ అస్త్రాన్ని సిద్ధం చేస్తున్నాడు. బాబు.., లోకేష్ ఇద్దరు తండ్రికొడుకులపై ఒకే బాణాన్ని వదులుతున్నాడు..! అదేమిటో లోపలి వెళదాం..!!

బాబు చేసిన తప్పుల లెక్క తయారు..!!

చంద్రబాబు ప్రభుత్వంలో అవినీతి ఎక్కడ అంటే..? అక్కడ, ఇక్కడ అని లేదు, అన్ని చోట్లా, అన్ని విభాగాల్లో జరిగింది. కానీ దాన్ని ఆధారాలతో నిరూపించడమే పెద్ద చిక్కు. అందుకే ఆ నాడు బాబు చేసిన అవినీతి ఆరు లక్షల కోట్లు అంటూ ప్రచారం చేసిన వైసీపీ పెద్దలు నేడు చేతిలో అధికారం ఉన్నప్పటికీ కనీసం 1000 కోట్లు కూడా ఆధారాలతో చూపించలేకపోతున్నారు.

అందుకే బాబు అవినీతి చేయడం అయితే పక్కా..! సరిగా వెతికితే దొరకడం పక్కా…! ఇక ఆలస్యం ఎందుకు ప్రాధమికంగా కొన్ని ఆధారాలు సేకరించడానికి అమరావతి రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్ పై మంత్రులను ఉపసంఘంగా వేసి కొన్నిటిని నిర్ధారించుకున్నారు. ఈ కేసుని సిట్ వేసి, దర్యాప్తుపై ఆదేశించారు. ఇక ఇక్కడితో ఆగకుండా సీబీఐ కూడా ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. అంటే చంద్రబాబు సహా బినామీలుగా చెప్పుకుంటున్న నాటి మంత్రులు నారాయణ, పుల్లారావు, సుజనా చౌదరి, లోకేష్, దూళిపాళ్ల నరేంద్ర వంటి పెద్దలు అందరూ సీబీఐ కేసుని ఎదుర్కోడానికి సిద్ధపడాల్సిందే.

లోకేష్ మెడకూ ఉంది పెద్ద ఉచ్చు..!!

చంద్రబాబుని రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్ అనే కేసుకి బుక్ చేస్తున్నారు..! మరి లోకేష్ సంగతేంటి..? దీనికి జగన్ దగ్గర సమాధానం ఉంది. లోకేష్ నిర్వహించిన ఐటీ శాఖలో వెతికితే బోలెడు అవినీతి ఉంటుంది. అందుకే కొద్దీ కాలంగా వితికారు, దొరికింది. ఇక సీబీఐకి అప్పగించేలా ఆలోచనల జరుగుతున్నాయి. ఐటీశాఖ ద్వారా నడిచిన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు విలువ రూ. 333 కోట్లు. దీని టెండర్ అప్పగింతలో “నీకూ – నాకూ” అనే లావాదేవీలు జరిగాయి అనేది జగన్ బృందం ఆరోపణ. ప్రాధమికంగా కొన్ని ఆధారాల చేతికి చిక్కాయి అందుకే ఇక సీబీఐ కి ఈ కేసుని ఇచ్చేయాలని జగన్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

జగన్ బాధ ఊరికే తీరుతుందా..??

పాపం జగన్..! 16 నెలలు జైలులో ఉండివచ్చారు. అవినీతి చేశారో, చేయలేదో అనే అంశాన్ని పక్కన పెడితే ఒక నాయకుడిగా ఎదుగుతున్న దశలో ఆయన జైలు జీవితాన్ని అనుభవించారు. 2019 ఎన్నికలకు ముందు అయితే పాదయాత్ర చేస్తూనే వారం వారం కోర్టుకి వెళ్లి వచ్చేవారు. అది చాల పెద్ద మానసిక బాధ…!! అందుకే ఆ బాధ రుచిని టీడీపీ పెద్దోళ్ళకు తెలియజేస్తూనే.., అవినీతిని కూడా బయటకు తీయాలి అనేది జగన్ ఆలోచన. అవినీతి అంటే తన పేరు చెప్తున్నా టీడీపీ శ్రేణులకు మీ నేత నా కంటే పెద్ద మేత అనేది చూపించాలి అనేది జగన్ అంటారా ఉద్దేశం కావచ్చు. కారణం ఏదైనా లోకేష్, చంద్రబాబులపై సీబీఐ విచారణ వేస్తే… జరిగితే.. జైలుకి వెళ్తే అప్పుడుంటుంది అవినీతి తక్కెడ సమపాళ్లలో అనేది తటస్థ వర్గాల వాదన.!!

 

 

 

author avatar
Srinivas Manem

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!