NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

అఖిలపక్షానికి అందరూ డుమ్మా

అమరావతి, జనవరి30: ఆంధ్రప్రదేశ్‌ విభజన హామీలు అమలు చేయాలని కోరుతూ రా ష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్‌ను అఖిలపక్ష నేతలతో ఫిబ్రవరి 12 న కలవనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వచ్చేనెల ఒకటవ తేదీనుంచి 13 వరకు ప్రత్యేక హోదా, విభజన హామీ తదితర అంశాలపై నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు.

ప్రత్యేక హోదా, విభజన హామీలు అనే అంశంపై ముఖ్యమంత్రి బుధవారం సచివాలయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ, జనసేన, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, వామపక్ష పార్టీలు హాజరు కాలేదు. ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్,బిఎస్సీ, ఎస్సీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ,  ఉద్యోగ సంఘాల నేతలు సమావేశంలో పాల్గొన్నారు. 12 వ తేదీన ముఖ్యమంత్రితో పాటు ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలిసేందుకు కూడా ప్రధాన రాజకీయపార్టీలు సిద్ధంగా లేవని తెలిసిపోతూనే ఉంది.

ప్రత్యేక హోదా విషయంలో కలిసికట్టుగా పోరాడేందుకు రాజకీయ పార్టీలు సిద్ధంగా లేవనీ, ఎవరి రాజకీయ ప్రయోజనాలు వారికి దాని కన్నా ప్రధానమనీ ఈ రోజు ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశం మరోసారి తేటతెల్లం చేసింది.

నిజానికి ప్రతిపక్షాలు తమ వైఖరిని నిన్ననే స్పష్టం చేశాయి. సరైన ఎజెండా లేకుండా నిర్వహించే మొక్కుబడి సమావేశాలకు దూరంగా ఉంటామని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ముఖ్యమంత్రికి లేఖ ద్వారా తెలిపారు. ఒక్కరోజు ముందు సమావేశానికి ఆహ్వానిస్తే ఎలా అని ఆయన ప్రశ్నించారు.

అఖిలపక్షం పేరుతో ముఖ్యమంత్రి కొత్త డ్రామా ఆడుతున్నారని వైసిపి నేత పేర్ని నాని ఆరోపించారు. ప్రజలు గగ్గోలు పెడతారని సమావేశం నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు.

ప్రచార ఆర్భాటం కోసంమే అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారని భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ ఆరోపించారు.

అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లమంటే ముఖ్యమంత్రి స్పందించలేదని పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. సమావేశానికి రమ్మని పార్టీ అధ్యక్షుడికి ఆహ్వానం పంపకుండా కార్యదర్శి జంగా గౌతమ్‌కు పంపడం సరికాదని ఆయన తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా ఇస్తామని ఆయన స్పష్టం చేశారు.

 

author avatar
Siva Prasad

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Leave a Comment