NewsOrbit
రాజ‌కీయాలు

డాక్టర్ సుధాకర్ కేసులో అతిపెద్ద ట్విస్టు..! సీబీఐపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!!

high court orders cbi on doctor sudhakar

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరి కొనితెచ్చుకున్న వివాదాల్లో డాక్టర్ సుధాకర్ ఉదంతం ఒకటి. రాష్ట్రంలో కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో విశాఖ జిల్లా నర్సీపట్నంలోని స్థానిక ఏరియా ఆసుపత్రిలో మత్తుమందు డాక్టర్ గా విధుల్లో ఉన్నారు సుధాకర్. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్లుగా సేవలు అందిస్తున్నారు డాక్టర్లు. అయితే.. తగినంత స్థాయిలో మాస్కులు, గ్లౌజులు, పీపీఈ కిట్లు అందుబాటులో లేవు. ఆ సమయంలో.. తగినంత భద్రతా సామిగ్రి లేకుండా వైద్యం ఎలా చేయాలి అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆ వీడియో బాగా వైరల్ అయింది. అయితే.. ఈ సమయంలో ప్రభుత్వం స్పందించాల్సిన రీతిలో కాకుండా విరుద్ధంగా వ్యవహరించి కోరి సమస్యలు తెచ్చుకుంది. దీంతో విషయం హైకోర్టుకు, అక్కడి నుంచి సీబీఐ వరకూ వెళ్లింది.

high court orders cbi on doctor sudhakar
high court orders cbi on doctor sudhakar

సీబీఐ విచారణపై హైకోర్టు ఏమందంటే..

సుధాకర్ కు ప్రభుత్వం షోకాజ్ నోటీస్ ఇవ్వలేదు. కారులో వెళ్తున్న ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రతిఘటించిన సుధాకర్ చేతులు వెనక్కు కట్టేసి రోడ్డుపై కూర్చోబెట్టారు. నాటకీయ పరిణామాల మధ్య అరెస్టు చేశారు. వైద్య పరిక్షలు చేయించి ఆయన మానసిక స్థితి బాగాలేదని తేల్చారు. దీనిపై మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత హైకోర్టులో పిల్ వేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. ఇన్ని నెలల తర్వాత సీబీఐ తన రిపోర్టును హైకోర్టులో సమర్పించారు. దీనిపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. నామమాత్రంగా ఈ రిపోర్టు తయారు చేసినట్టుందని వ్యాఖ్యానించింది. దీనిపై అడిషనల్ డైరక్టర్ ను నియమించి మళ్లీ దర్యాప్తు చేయాలని ఆదేశించింది.

ప్రభుత్వం చేతులారా చేసుకుందా..

అయితే.. అప్పట్లో సుధాకర్ యూ టర్న్ తీసుకున్నారు. తనకు ప్రభుత్వంపై, సీఎం జగన్ పై ఎటువంటి కోపం లేదని ఉద్ఘాటించారు. దీంతో సుధాకర్ స్వయంగా మాట్లాడిన తర్వాత విచారణను ముగించినట్టు తెలుస్తోంది. ఇందులో కుట్ర కోణం ఉండొచ్చు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయనట్టు అనిపిస్తోంది. రజకీయ కారణాలు ఉన్నాయా? అని కూడా అనుమానం వ్యక్తం చేసింది. మరింత లోతుగా దర్యాప్తు చేసి 2021 మార్చి 31కి నివేదిక అందించాలని ఆదేశించింది. సీబీఐ నివేదికను కూడా హైకోర్టు తప్పు పట్టిందంటే.. దీనిపై హైకోర్టు ఎంత సీరియస్ గా ఉందో అర్ధమవుతోంది. గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకూ తెచ్చుకున్నట్టైంది ప్రభుత్వం పరిస్థితి. హైకోర్టు తీరుతో మళ్లీ ఏపీ ప్రభుత్వానికి, హైకోర్టుకి మధ్య మళ్లీ గ్యాప్ వచ్చినట్టైంది. మరి సీబీఐ ఎలా విచారణ చేస్తుందో చూడాలి.

author avatar
Muraliak

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?