NewsOrbit
Featured రాజ‌కీయాలు

కేసీఆర్ జాతీయ గీతం..!! కొత్త కాదు కానీ..!!

kcr to enter national politics

జాతీయ రాజకీయాల్లో కేసీఆర్..! ఈ మాట ఇప్పటిది కాదు. నాలుగైదేళ్లుగా కేసీఆర్ పాడుతున్న పాట. అయితే.. బీజేపీ వ్యతిరేక పక్షాలను కూడగట్టే క్రమంలో కాంగ్రెస్ వ్యతిరేక పక్షాలను కూడా కలిపే ప్రయత్నాలు చేస్తున్నారు. దీని ద్వారా తృతీయ ఫ్రంట్ ఏర్పాటు చేయాలనేది కేసీఆర్ ప్లాన్. ప్రాంతీయ పార్టీలు జాతీయ శక్తిగా ఎదగాలంటే.. ప్రాంతీయ పార్టీల్లో అతిపెద్ద శక్తిగా ఉన్న మమతా బెనర్జీ, కేజ్రీవాల్, జగన్, నవీన్ పట్నాయక్, స్టాలిన్.. సాయం తప్పనిసరి. వీరందరితో కేసీఆర్ కొత్త పార్టీ ఏర్పాటు చేసినా తానే పగ్గాలు అందుకుంటాడని.. అందుకు వారంతా ఒప్పుకుంటారని నమ్మకం లేదు. వీరి నుంచి మద్దతు లభించినా తెలంగాణ ప్రజల నుంచి మద్దతు ఎంతమేర ఉంటుందనేదే ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే..

kcr to enter national politics
kcr to enter national politics

లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ తీర్పు.. గుర్తుందిగా..

2018 సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ కు తిరుగులేని ఆధిపత్యం ఇచ్చారు తెలంగాణ ప్రజలు. నువ్వే మహారాజువయ్యా.. నువ్వే మా సీఎం.. అంటూ నెత్తినపెట్టుకుని మరీ అసెంబ్లీకి పంపించారు. అయితే.. ఇదే ఊపు పార్లమెంట్ ఎన్నికల్లో లేకపోయింది కేసీఆర్ కు. అసెంబ్లీ హవానే కొనసాగుంటే 16 స్థానాలకు కనీసం 14 అయినా రావాలి. కానీ సగానికి సగం.. అంటే 8 స్థానాలతో సరిపెట్టుకుంది. మిగిలినవి బీజేపీ, కాంగ్రెస్ పంచుకున్నాయి. దీంతో కేసీఆర్ ను జాతీయ రాజకీయాల్లోకి పంపించడం ప్రజలకు ఇష్టం లేనట్టుంది. కానీ.. కారు సారు మనసు ఢిల్లీ వైపు పరుగులెడుతోంది. రాష్ట్ర పగ్గాలు తనయుడు కేటీఆర్ కు అప్పగించి ఢిల్లీ గద్దెనెక్కాలనేది కేసీఆర్ ఆలోచన.

జాతీయపార్టీ సన్నాహాలిలా..

‘నయా భారత్‌’ పేరుతో కేసీఆర్ ఒక జాతీయ పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 2022 చివర్లో.. లేదా 2023లో జమిలి ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో కేంద్రం ఉందని వార్తలు వస్తున్నాయి. దేశంలో అధ్యక్ష తరహా ఎన్నికలు జరిగే అంశంపై గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ ఆధ్వర్యంలో ఓ కమిటీ వేసింది. ఇది అమల్లోకి వస్తే లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ పార్టీలు మాత్రమే పోటీ చేయాలి. ఈనేపధ్యంలో కేసీఆర్ జాతీయపార్టీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ‘నయా భారత్‌’ పేరుతో హరియాణా, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో పార్టీలు ఉండటతో వారితో టీఆర్‌ఎస్‌ నేతలు చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. దీనిపై మాడభూషి శ్రీధర్ వంటి న్యాయ ప్రముఖులతో కూడా కేసీఆర్‌ చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సోమవారం జరిగే టీఆర్‌ఎస్ఎల్పీ సమావేశంలో ఈ విషయాలపై చర్చ జరగొచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి.

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju

Video Morphing Case: అమిత్ షా డీప్ షేక్ వీడియో కేసు.. గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు ..సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు

sharma somaraju

బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల‌హీన నేత‌లు.. వైసీపీ సాధించేదేంటి..?

దెందులూరులో మా ఓడికి ఓట‌మే నో డౌట్‌… వైసీపీ లీడ‌ర్లే ఒప్పేసుకుంటున్నారే..?

ఏపీలో మేనిఫెస్టో జోష్ తుస్‌.. ఇంత షాక్ ఇచ్చారేంట‌బ్బా…?

పింఛ‌న్లు-ప‌రేషాన్లు.. వైసీపీ ఉచ్చులో టీడీపీ.. !

BRS: బీఆర్ఎస్ కు మరో షాక్ .. కాంగ్రెస్ కండువా కప్పుకున్న మరో కీలక నేత

sharma somaraju