NewsOrbit
న్యూస్ మీడియా రాజ‌కీయాలు

రామోజీ, రాధాకృష్ణ ఓ వైపు… విజ‌యసాయిరెడ్డి ఓ వైపు..

ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్‌, అదే స‌మ‌యంలో దేశంలోనే సంచ‌ల‌న అంశం సుప్రీంకోర్టు జ‌డ్జి విష‌యంలో ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం చేసిన ఫిర్యాదు.

ఈ విష‌యంలో రాజ‌కీయ‌, న్యాయ‌వ‌ర్గాల్లో కీల‌కంగా మారిన ఈ ఉదంతంలో వైసీపీ ఎంపీ, పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి తెర‌మీద‌కు వ‌చ్చారు. అదే స‌మ‌యంలో మీడియా పెద్ద‌లు రామోజీ రావు, రాధాకృష్ణా ఉదంతాల‌ను మ‌రోమారు ప్ర‌స్తావించారు.

దేశంలోనే సంచ‌ల‌నం..

వైసీపీ అధికార ప్ర‌తినిధి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ “ప్రభుత్వ సలహాదారులు అజేయ కల్లం నిర్వ‌హించిన‌ మీడియా సమావేశంలో ఈ నెల 8వ తేదీన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ బాబ్డేకి రాసిన ఉత్తరాన్ని వెలుగులోకి తెచ్చారు. ఇందులో సుప్రీంకోర్టులో సీనియర్ జడ్జిగా పనిచేస్తున్న జస్టీస్ రమణ ఏవిధంగా ఇంటర్ ఫియర్ అవుతున్నారనే దానిపైనా, ఆయన జూనియర్  దమ్మాలపాటి శ్రీనివాస్ కు అనుకూలంగా జడ్జిమెంట్లు ఇచ్చిన పరంపర, వారితో కలిసి రాజధాని భూములు కొనుగోలు విషయాలపై రాసిన ఆ లేఖను బహిర్గతం చేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మాతోపాటు దేశ ప్రజలను, ఆంధ్ర ప్రదేశ్ ప్రజలను ఇక్కడ ఆశ్చర్యపరిచింది ఏమిటంటే..  కెమెరాలు అన్నీ వచ్చాయి గానీ, ఎవరు కూడా లైవ్ చూపించే ప్రయత్నం చేయలేదు. తర్వాత కూడా ఈ వార్తను ప్రసారం చేయలేదు. కొన్ని పత్రికలైతే, ముఖ్యంగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఇది అసలు వార్తాంశమే కాదన్నట్టు ఆ వార్తను నిలువరించారు. నొక్కేశారు, మింగేశారు. ఎందుకు ఆ విషయాన్ని నొక్కేశారు.. అని ప్రజలు, మేము ఆలోచిస్తున్నాం?“ అంటూ కొత్త డౌట్ రేకెత్తించా‌రు.

రామోజీ రావు, రాధాకృష్ణా…

ఈ సంద‌ర్భంగా మీడియా గురించి అంబ‌టి రాంబాబు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. “జాతీయ పత్రికలకు సంబంధించి అన్నీ కూడా ఈ విషయాన్ని ప్రధానమైన అంశంగా భావించి ప్రచురించాయి, జాతీయ న్యూస్ ఛానెళ్ళు కూడా టెలీ కాస్ట్ చేశాయి. మన రాష్ట్రంలో మాత్రం తెలుగు ఛానెళ్ళు చూపించలేదు. పత్రికలు రాయలేదు, ఎందుకు..?  జాతీయ మీడియాకు చెందిన పలు ఇంగ్లీషు, హిందీ పత్రికలు, పొరుగు రాష్ట్రానికి చెందిన తెలుగు పత్రికలు, జాతీయ టీవీ ఛానెళ్ళు ప్రసారం చేసిన వార్తను ఆంధ్రప్రదేశ్ లోని ఒక సెక్షన్ మీడియా ఎందుకు నొక్కేశారు..?  ఇది ప్రజాస్వామ్యంలో హర్షించదగినదా? ఒక ముఖ్యమంత్రి కొంతమంది జడ్జిల మీద కంప్లైంట్ చేస్తే.. ఆ వార్తను ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికాధిపతులైన రామోజీ రావు, రాధాకృష్ణ ఎందుకు నొక్కి వేస్తున్నారు. దీని వెనుక ఏమి కుట్ర ఉన్నది..? ఎవ‌రు దీని వెనుకాల ఉండి ఈ నాట‌కం ఆడిస్తున్నారు.? “ అని అన్నారు.

ఏంటండి ఇది?

మీడియావారు పత్రికా స్వేచ్ఛ అని మాట్లాడుతుంటారు. అసలు పత్రికా స్వేచ్ఛ అంటే ఏమిటి..? అంటూ అంబ‌టి అనుమానం వ్య‌క్తం చేశారు. “ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దేశంలోనే సర్వోన్నత న్యాయ స్థానం చీఫ్ జస్టీస్ కు ఆధారాలతో కూడిన లేఖ రాస్తే.. దానిని ప్రచురించకపోవడం, టీవీల్లో చూపించకపోవడం పత్రికా స్వేచ్ఛ అవుతుందా..?  లేదా పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించటం అవుతుందా..?  విజ్ఞులైన మీరే ఆలోచించండి. “ అంటూ ప్ర‌జ‌ల‌కు సూచించారు.

విజ‌యసాయిరెడ్డి టార్గెట్ అయ్యారుగా

మ‌రోవైపు వైసీపీ ఎంపీ విజ‌యసాయిరెడ్డి టీడీపీ నేత‌ల‌కు టార్గెట్ అయ్యారు. ట్విట్టర్లో టిడిపి నేత మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆయ‌నపై ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. “ప్రపంచంలో ప్రతి విషయం పైనా  ట్విట్టర్లో ఎగిరి దూకే విజయ సాయి జడ్జీలపై జగన్ రెడ్డి రాసిన లేఖపై కిక్కురుమనడం లేదు ఎందుకని? రెచ్చిపోతే బెయిల్ రద్దు అవుతుందని భయమా? లేకపోతే అప్రూవర్ గా మారిపోయి అసలు గుట్లన్నీ బయట పెట్టేద్దామనా?“` అంటూ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ప్ర‌శ్నించారు.

author avatar
sridhar

Related posts

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N