NewsOrbit
Featured రాజ‌కీయాలు

కేసీఆర్ పై రేవంత్ గురి..! ఈసారి స్ట్రాంగ్ గా..

revanth reddy targets cm kcr

శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ప్రమాదంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న రేవంతర్ రెడ్డిని దిండి సమీపంలో పోలీసులు అరెస్టు చేశారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం జరిగింది. ఇప్పటికే శ్రీశైలం ఘటనపై జోక్యం చేసుకోవాలని గవర్నర్ తమిళిసై కు రాసిన లేఖలో రేవంత్ రెడ్డి కోరారు. ఇది మానవ తప్పిదమే అని రేవంత్ ఆరోపించారు. సిబ్బంది రెండు రోజుల క్రితమే హెచ్చరించినా ఉన్నతాధికారులు పట్టించుకోలేదని రేవంత్ పేర్కొన్నారు. ప్రమాదానికి మంత్రి జగదీశ్వర్ రెడ్డి, సీఎండీ ప్రభాకర్ రావు బాధ్యత వహించాలని రేవంత్ డిమాండ్ చేశారు. బాధితులకు కోటి పరిహారంతోపాటు ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

revanth reddy targets cm kcr
revanth reddy targets cm kcr

బాధిత కుటుంబాలను పరామర్శించే స్వేచ్ఛ మాకు లేదా.

దీంతో కేసీఆర్ కూడా రేవంత్ రెడ్డిపై ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. గతం నుంచీ కూడా సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి ఉన్న వైరం తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సీఎంపై శ్రీశైలం ఘటనలో రాజకీయంగా ఇరుకున పెట్టాలని భావించారు. అయితే.. రేవంత్ ఈ విషయాన్ని రాజకీయం చేస్తున్నారని భావించారు. దీంతో రేవంత్ నాగర్ కర్నూలు వెళ్తూండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసులకు కాంగ్రెస్ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. అక్కడ స్వల్ప ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రాష్టంలో కేసీఆర్ నియంతలా మారారని.. బాధిత కుటుంబాలను పరామర్శించే స్వేచ్ఛ కూడా ప్రతిపక్ష నేతలకు లేకుండా చేస్తున్నారని ట్విట్టర్లో ఆరోపించారు. కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారంటూ ప్రశ్నించారు.

కీసర ఎమ్మార్వో కేసులో కూడా రేవంత్ రెడ్డి హస్తంపై పుకార్లు..

కీసరగుట్టలో ఎమ్మార్వో కేసులో రేవంత్ పాత్ర ఉందని ఆరోపణలు వస్తున్నాయి. ఎమ్మార్వో వద్ద 100 కోట్లు అవినీతి సొమ్ము ఉందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఆయన కోటి రూపాయలు లంచం తీసుకుంటూండగా పట్టుకున్నారు. ఆయన వద్ద రేవంత్ రెడ్డికి సంబంధించి దస్తావేజులు ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ కేసులో రేవంత్ రెడ్డిని ఇరికించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే.. ఇందుకు తగ్గ బలమైన ఆధారాలు వారికి లభించలేదు. దీంతో రేవంత్ రెడ్డిని ఈ కేసులో ఇరికించాలని కేసీఆర్ భావిస్తుంటే.. శ్రీశైలం ఘటనలో కేసీఆర్ ను దోషిగా చూపేందుకు రేవంత్ ప్రయత్నాలు చేస్తున్నారు.

 

Related posts

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!