NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

చంద్రబాబుకి పెద్ద ఊరట..! ఆ ఎమ్మెల్యేలు ఇక “ఫిక్సయినట్టే”..!?

పాపం చంద్రబాబు.., పాపం టీడీపీ..!! ప్రతిపక్షమంటే ఈ మాత్రం జాలి, దయ, కరుణ లేకుండా జగన్ ఎమ్మెల్యేలను లాగేసారు. బాబుకి నిద్ర లేకుండా చేశారు. ఆయనకు ఆ ప్రతిపక్ష పాత్ర కూడా మిగలకుండా పోతుందా..? అనేంతగా భయపడేలా చేశారు..! ఏకంగా ఏడాదిన్నరలోనే నలుగురు ఎమ్మెల్యేలను లాగేసి భయపెట్టారు. ఇది ఇక్కడితో ఆగినట్టేనా..? ఇంకా ఉందా..? అనే అనుమానాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. వాటికి చంద్రబాబుకి కొంచెం ఊరట కలిగే వార్తలు మాత్రం వస్తున్నాయి. ఒక్కరు మినహా మిగిలిన అందరూ ఉన్నట్టేనని టీడీపీ వర్గాలు ధీమాగానే ఉన్నాయి.

చంద్రబాబు మినహా ఇప్పుడు టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేలను ఓ సారి చూసుకుంటే… ఆదిరెడ్డి భవాని (రాజమండ్రి సిటీ), గోరంట్ల బుచ్చయ్య చౌదరి (రాజమండ్రి గ్రామీణం), జోగేశ్వరరావు (మండపేట), చినరాజప్ప (పెద్దాపురం), వెలగపూడి రామకృష్ణ (విశాఖ తూర్పు), గణబాబు (విశాఖ పశ్చిమ), గంటా శ్రీనివాసరావు (విశాఖ ఉత్తర), నిమ్మల రామానాయుడు (పాలకొల్లు), వేటుకూరి రామరాజు (ఉండి), భేతాళం అశోక్ (ఇచ్చాపురం), కింజరాపు అచ్చెన్నాయుడు (టెక్కలి), బాలకృష్ణ (హిందూపురం), ఏలూరి సాంబశివరావు (పర్చూరు), గొట్టిపాటి రవికుమార్ (అద్దంకి), అనగాని సత్య ప్రసాద్ (రేపల్లె), డీబీవీ స్వామి (కొండపి), పయ్యావుల కేశవ్ (ఉరవకొండ)..! సో.., చంద్రబాబు కాకుండా 19 మంది ఉన్నారు. వీరిలో…!!

Hyderabad TDP chief N Chandrababu Naidu addressing Seemandhra TDP party members meeting in Hyderabad on Monday PTI PhotoPTI2 24 2014 000132A

ఒక్కరే దూరమయ్యే అవకాశం..!!

వీరిలో చినరాజప్ప, బుచ్చయ్య చౌదరి, రామానాయుడు, అచ్చెన్నాయుడు, కేశవ్, వెలగపూడి రామకృష్ణ లాంటి వాళ్ళు టీడీపీకి కంకణబద్ధులు. చంద్రబాబుకి అత్యంత నమ్మకస్తులు అసలు పార్టీని వీడరు. కొన్ని నెలల కిందట ఇదిగో, అదిగో పార్టీ మారిపోతారు అనుకున్న ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్, గణబాబు, సత్యప్రసాద్ కూడా ఆ జాబితాలోకి చేరిపోయారు.
* కొండపి స్వామి, ఇచ్చాపురం అశోక్ ఇద్దరూ వైద్యులు, జనంతో బాగా ఉన్నవారు. పార్టీలు మారడం మనకు అవసరమా..? అనుకునే ధోరణిలో సైలెంట్ గా పని చేసుకుంటున్నారు.


* ఇక మిగిలిన వారిలో గొట్టిపాటి రవికుమార్ కి ప్రత్యేక పరిస్థితులు. నిజానికి గంటా శ్రీనివాసరావు, గొట్టిపాటి రవికుమార్ ఇద్దరూ కూడా పార్టీలో ఇన్నాళ్లు ఉంటారని చంద్రబాబు కూడా ఊహించి ఉండరు. కానీ అటు సామాజికవర్గం, ఇటు బాబు యత్నాలతో రవికుమార్ అలా టీడీపీలో సెట్టయిపోయారు. ఇప్పుడిప్పుడే జగన్ కి, వైసిపికి యాంటీ అవుతున్నారు. “నన్ను దెబ్బ తీశారు, నేను దెబ్బ తింటాను. కానీ నా టైం రాకమానదు” అంటూ సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారు. అంటే ఆయన ఇక వైసీపీ వెళ్ళనట్టే.
* ఇక అనుమానాలు మిగిలింది ఇద్దరిపైనే ఆదిరెడ్డి భవానీ, గంటా శ్రీనివాసరావు. వీరిలో ఆదిరెడ్డి భవానీ టీడీపీకి ఒకప్పుడు పెద్దదిక్కుగా ఉన్న కింజరాపు ఎర్రన్నాయుడు కూతురు. ఆమె బాబాయి అచ్చెన్నాయుడు పార్టీ అధ్యక్షుడుగా ఉన్నారు. సో.., ఆమెకి మారాలని లేదు. కానీ ఆమె మామ, ఆదిరెడ్డి అప్పారావు మాత్రం వైసీపీతో టచ్ లో ఉన్నారు. ఆయన గతంలో అదే పార్టీలో ఉంటూ, టీడీపీకి వచ్చారు. ఇప్పుడు అటు వెళ్లాలని ఆయనకు ఉంది, కానీ ఈ కుటుంబం ఏకాభిప్రాయానికి రావడం లేదు. అందుకే ఇప్పుడే చెప్పలేం.

cm jagan giving shiver to ganta srinivasa rao
cm jagan giving shiver to ganta srinivasa rao

* ఇక మిగిలింది గంటా శ్రీనివాసరావు గురించే.. ఈయన గురించి ఎన్ని చెప్పినా అక్షరాలు చాలవు. సింపుల్ గా చెప్పాలంటే ఈయన టీడీపీలో ఉండరు. ఆ విషయం ఆయన అనుచరులకు, విశాఖ వాసులకు, నియోజకవర్గ ఓటర్లకు, చంద్రబాబుకి, లోకేష్ కి అందరికీ తెలుసు. కానీ వైసీపీలో ద్వారాలు మూసేసారు. ఆ ద్వారం వద్దనే కూర్చుని తొంగి చూస్తున్నారు. పిలుపు వచ్చిన వెంటనే లోపలి దూకెయ్యాలని. మరోవైపు బీజేపీ ద్వారాలు తెరిచి రమ్మంటుంది. వైసీపీ ద్వారాలు తెరుచుకోకపోతే, బీజేపీ ద్వారంలోకి వెళ్లడం ఖాయం.

 

 

 

author avatar
Srinivas Manem

Related posts

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju