జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకార ఖర్చు ఎంతో తెలుసా?

Share

అమరావతి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లోటులో ఉన్నందున ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని నిరాడంబరంగా నిర్వహించాలనీ, అనవసర వ్యయం తగ్గించాలని ప్రమాణ స్వీకారానికి ముందు వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వి సుబ్రమణ్యాన్ని ఆదేశించారు.

జగన్ ఆలోచనలకు అనుగుణంగా అధికారులు దుబారా వ్యయాన్ని తగ్గించారు. దీంతో దాదాపు 20లక్షల రూపాయలకు పైగా ప్రభుత్వానికి ఆదా చేయగలిగారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఖర్చు 50లక్షల రూపాయల  వరకూ కాగా, జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకారానికి  కేవలం 29లక్షల 10వేల రూపాయలు ఖర్చు అయ్యింది. జివో 1177 ద్వారా జరిగిన ఖర్చుల వివరాలను ప్రభుత్వం విడుదల చేసింది. అతిధులు, ప్రజలు, పార్టీ కార్యకర్తలు, మౌలిక సదుపాయాల కోసం ఈ మొత్తాన్ని ఖర్చు చేసినట్లు పేర్కొంది. అధికారం చేపట్టిన తొలి రోజే ప్రభుత్వానికి జగన్మోహనరెడ్డి 20లక్షల రూపాయల వ్యయాన్ని తగ్గించడంపై ఆ పార్టీ నేతలు దటీజ్ జగన్ అని కితాబు ఇస్తున్నారు.


Share

Related posts

పక్కాగా పక్క రాష్ట్రాలకు..! కేసీఆర్ జాతీయ ప్రణాళిక ఇదే..!!

Srinivas Manem

హద్రాత్ వెళ్ళకుండా రాహుల్‌, ప్రియాంకను అడ్డుకున్న పోలీసులు.. ఉద్రిక్తత

Special Bureau

Corona : టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు క‌రోనా … తెలంగాణ‌లో సంచ‌ల‌న నిర్ణ‌యాలు

sridhar

Leave a Comment