BRO Movie Review: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన “బ్రో” మూవీ నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. మెగా మల్టీస్టారర్ సినిమాగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. మరి “బ్రో” సినిమా రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
సినిమా: బ్రో
నటినటులు: పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్, కేథిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్, బ్రహ్మానందం, ఊర్వశి రౌతుల, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, రోహిణి తదితరులు
కెమెరా: సుజిత్ వాసుదేవ్
ఎడిటింగ్: నవీన్ నూలి
సంగీతం: తమన్
స్క్రీన్ ప్లే, సంభాషణలు: త్రివిక్రమ్
నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్.
నిర్మాణ సంస్థలు: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్.
దర్శకత్వం: సముద్రఖని
విడుదల తేదీ: 28 జూలై 2023
పరిచయం:
తమిళ సినిమా రంగంలో తెరకెక్కిన “వినోదయ సీతం”కి “బ్రో” సినిమాగా తెలుగులో రీమేక్ చేయటం జరిగింది. తమిళంలో నటించిన సముద్రఖని తెలుగులో దర్శకుడు కావడం విశేషం. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ని ఏ రకంగా చూడాలని అభిమానులు ఆశిస్తున్నారో అదే రీతిలో “బ్రో” తెరకెక్కించారు. నేడు విడుదలైన ఈ సినిమా మెగా అభిమానులను ఎంతగానో అలరిస్తూ ఉంది. ఒకపక్క భారీ వర్షాలు పడుతున్న గాని “బ్రో” సినిమా ధియేటర్ వద్ద అభిమానుల తాకిడి విపరీతంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బెనిఫిట్ షోలు పడగా… తెలంగాణలో అనుమతులు ఇవ్వలేదు. మామ అల్లుళ్లు పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్.. ఫస్ట్ టైం కలిసి నటించడంతో మొదటి రోజు “బ్రో” కలెక్షన్స్ రికార్డు స్థాయిలో వచ్చాయి. మామూలుగానే పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఆ క్రేజ్ వేరేగా ఉంటుంది. ఆ రీతిలోనే “బ్రో” ఓపెనింగ్స్ భారీగా వచ్చినట్లు సమాచారం. అయితే నేడు విడుదలైన “బ్రో” సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
స్టోరీ:
ఇంటి పెద్ద కొడుకుగా మార్కండేయులు (సాయి ధరమ్ తేజ్) తండ్రి మరణం తర్వాత అన్ని బాధ్యతలు తన భుజాన వేసుకుంటాడు. ఈ క్రమంలో ఇద్దరు చెల్లెలు మరియు తమ్ముడు స్థిరపడాలని ఉద్యోగంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలని నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. ప్రతి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ డబ్బు సంపాదన ధ్యేయంగా బతుకుతాడు. ఈ క్రమంలో చివరాఖరికి ప్రియురాలు రమ్య (కేతికా శర్మ)తో కూడా సమయాన్ని గడపలేడు. ఈ రకంగా ఉరుకుల పరుగులు జీవితాన్ని గడుపుతున్న మార్క్ ఓ రోజు ప్రమాదానికి గురై మరణిస్తాడు. తరువాత అతని ఆత్మ అంధకారంలోకి వెళ్ళిపోతది. అక్కడ ఓ వెలుగు ద్వారా టైంగాడ్ టైటాన్(పవన్ కళ్యాణ్) మార్క్ కి ప్రత్యక్షమవుతాడు. దీంతో మార్క్ భూమిపై తన కుటుంబ జీవితానికి సంబంధించి కష్టాలను టైంగాడ్ టైటాన్ కి తెలియజేస్తాడు. ఈ రకంగా ఇంటికి పెద్ద కొడుకు నైనా తనని తొందరగానే కాలం చేసేలా ముగింపు పలకటం పట్ల అన్యాయం అనీ మొరపెట్టుకుంటాడు. తనని మళ్లీ ఇంటికి చేర్చి 90 రోజులలో అన్ని పనులు చేసుకునేలా.. అందరి బాధ్యతలు నిర్వర్తించడానికి అవకాశం ఇవ్వాలని..మార్క్ వేడుకొనటంతో టైంగాడ్ టైటాన్..జీవించడానికి అవకాశం ఇస్తారు. మరి ఈ క్రమంలో మార్క్ ఆ 90 రోజులలో అనుకున్నవన్నీ చేశాడా..? టైంగాడ్ టైటాన్ …మార్క్ కి ఏ విధంగా సహాయపడ్డాడు అనేది మిగతా స్టోరీ.
విశ్లేషణ:
ఇది కంప్లీట్ పవన్ కళ్యాణ్ అభిమానుల సినిమా అని చెప్పవచ్చు. “బ్రో” లో చాలాకాలం తర్వాత పవన్ కళ్యాణ్ లో ఒకప్పటి ఎనర్జిటిక్ యాక్టింగ్.. కామెడీ టైమింగ్ అద్భుతంగా తెరపై పండింది. ఇక పవన్ లైట్ గడ్డం లుక్ ఎంతగానో ఆకట్టుకుంది. మూడు సంవత్సరాల క్రితం తమిళంలో విడుదలైన “వినోదయ సీతం” తెలుగు రీమేక్ గా వచ్చిన “బ్రో” సినిమా చాలావరకు కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఫాంటసీ తరహాలో తెరకెక్కించారు. జీవితంలో చాలా బాధ్యతలు కలిగిన ఓ వ్యక్తికి రెండో అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది..? ఈ క్రమంలో సమయాన్ని ఎలా సద్వివినయోగం చేసుకుంటాడు..? అతను అనుకున్న పనులు జరుగుతాయా లేదా అనేది అసలు “వినోదయ సీతం” స్టోరీ. ఇక తెలుగులో పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరో చేస్తూ ఉండటంతో చాలా మార్పులు చేశారు. తమిళంలో రెండో అవకాశం వయస్సు అయిపోయిన ఓ ముసలాయనకు అవకాశం ఇస్తే ఇక్కడ రెండో అవకాశం ఓ యువకుడికి ఇచ్చినట్లు చూపించారు. ఇక తమిళంలో టైంగాడ్ పాత్ర నిడివి చాలా తక్కువ కానీ తెలుగులో మాత్రం సినిమా మొత్తం..టైంగాడ్ పాత్ర చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. చాలా వరకు స్టోరీ కంటే పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని ఫోకస్ చేసుకుని సినిమా చేయడం జరిగింది. స్టోరీకి తక్కువ ప్రాధాన్యత టైంగాడ్ టైటాన్ పాత్రకి ఎలివేషన్లు ఎక్కువ చూపించడం ప్రేక్షక సహనానికి పరీక్ష పెట్టినట్లు అయింది. సినిమా ప్రారంభమైన పది నిమిషాలు మాత్రమే సాయి ధరమ్ తేజ్ పాత్ర నడుస్తుంది తర్వాత పూర్తిగా పవన్ చుట్టూ కథ నడుస్తుంటది. పవన్ కళ్యాణ్ ని ఎలివేట్ చేస్తూ చూపించటం ఆయన అభిమానులను ఎంతగానో అలరిస్తూ ఉంటాది. కానీ సాధారణ ప్రేక్షకుడికి మాత్రం పరీక్ష పెట్టినట్లు ఉంటుంది. మొదటి భాగం పూర్తిగా కామెడీతో అలరిస్తే సెకండ్ హాఫ్ భావోద్వేతకరమైన సన్నివేశాలతో సెంటిమెంట్ టచ్ తో సముద్రఖని సినిమాని నడిపించారు. సాయి ధరమ్ తేజ్ తన పాత్రకి అద్భుతంగా న్యాయం చేశారు. ఇక ఈ సినిమాలో సాయి ధరం తేజ్ ప్రేయసిగా నటించిన కేతీక శర్మ.. పాత్రనిడివి చాలా తక్కువ. అయినా గాని ఈ ముద్దుగుమ్మ ఓ పాటలో అద్భుతంగా ఆకట్టుకుంది. మరో హీరోయిన్ ప్రియ వారియర్ కూడా తన పాత్రతో పర్వాలేదు అనిపించింది. భారీ తారాగణం రోహిణి, బ్రహ్మానందం, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి వంటి నటీనటులు కూడా నటించారు. అన్నిటికంటే ఎప్పటిలాగానే తమన్ మరోసారి తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో.. పవన్ కళ్యాణ్ హీరోయిజంకి తగ్గట్టు బాణీలు ఇవ్వడం జరిగింది. త్రివిక్రమ్ రాసిన కొన్ని డైలాగ్స్ పరవాలేదు అనిపించాయి. అయితే ఎక్కువగా పవన్ పాత్రకి ప్రాధాన్యత ఇవ్వడంలో దర్శకుడు కథని ప్రేక్షకుడికి కనెక్ట్ చేయడం మిస్ అయ్యాడని చెప్పవచ్చు.
పాజిటివ్స్:
పవన్ కళ్యాణ్ కామెడీ టైమింగ్
క్లైమాక్స్
తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్
పవన్ తేజ్ మధ్య సన్నివేశాలు
ఫస్ట్ ఆఫ్
నెగిటివ్స్:
త్రివిక్రమ్ డైలాగ్స్
పవన్ వింటేజ్ నీ ఓవర్ గా చూపించటం
ప్రొడక్షన్ వ్యాల్యూస్
విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ వర్క్
చివరిగా: “బ్రో” ..పవన్ అభిమానులను అలరిస్తే.. సామాన్య ప్రేక్షకుల సహనానికి మాత్రంఓ పరీక్ష.
గమనిక: ఈ సమీక్ష సమీక్షుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.