రివ్యూ : వ్యూహం – ఆహా టీవీ : థియేటర్లన్నీ మళ్ళీ తెరుచుకున్న నేపథ్యంలో వరుసగా సినిమా రిలీజ్ డేట్లు ఇచ్చేశారు. ఇలాంటి సమయంలో ఏకైక తెలుగు ఛానల్ ఆహా మరొక కొత్త సినిమాతో ముందుకు వచ్చింది. వ్యూహం అనే ఒక డబ్బింగ్ కోర్టు రూమ్ డ్రామా తో టాలెంటెడ్ నటీనటులతో తో తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం…
Vyooham Web Series 2023: నేటి నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో “వ్యూహం” తెలుగు వెబ్ సిరీస్ స్ట్రీమింగ్..!!
కథ :
హీరో ఒక హోటల్ లో పని చేస్తూ ఉంటాడు. అయితే ఆ హోటల్ లో ఒక ఘోరమైన హత్య జరుగుతుంది. ఇక హోటల్ ఇన్వెస్టిగేషన్ కు వచ్చిన పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ డిపార్ట్మెంట్ హీరో పైన ఆ నేరం మోపేందుకు చూస్తూ ఉంటారు. ప్రతి ఒకటి అతనికి వ్యతిరేకంగా క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో హీరో తరపున పోరాడే వారు కొంతమంది ఉంటారు. అతను ఆ పరిస్థితుల నుండి ఎలా బయట పడ్డాడు..? కోర్టు రూమ్ నిజంగా ఎలా ఉంటుంది? అతనికి సహాయం చేసే వారు ఎవరు? అతనిని ఈ హత్యలోకి ఎందుకు ఇరికించాలని అనుకుంటున్నారు…? చివరికి నిర్దోషిగా బయటపడేందుకు అతను ఏమి చేశాడు అన్నదే కథ..!
Vyooham Web Series: నేటి నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో “వ్యూహం” తెలుగు వెబ్ సిరీస్ స్ట్రీమింగ్..!!
ప్లస్ లు
నటీనటుల పర్ఫార్మెన్స్
అమాయకుడిగా హీరో క్యారెక్టర్
కొన్ని యాక్షన్ సన్నివేశాలు
మైనస్ లు
స్క్రీన్ ప్లే
బోరింగ్ గా సాగే సినిమా
థ్రిల్లర్ కు సరిపోయే సన్నివేశాలు లేకపోవడం
సినిమా నిడివి
ఇన్వెస్టిగేషన్ జరిగే పద్ధతి
విశ్లేషణ :
వ్యూహం అనే టైటిల్ ఎంత ఆసక్తికరంగా ఉందో… సినిమా అంత బోరింగ్ గా ఉంటుంది. హీరో క్యారెక్టర్ ను బాగా డిజైన్ చేశారు. నటీనటుల పెర్ఫార్మెన్స్ కూడా టాప్ క్లాస్ అని చెప్పాలి. అయితే బలమైన కథనం లేకపోవడం చాలా పెద్ద మైనస్. అంతేకాకుండా స్క్రీన్ ప్లే స్లోగా ఉంటుంది. కీలకమైన సన్నివేశాలు ఏమీ లేవు. కావలసినంత ఆసక్తిని జనరేట్ చేయడంలో దర్శకుడు పూర్తిగా విఫలం అయ్యాడు కోర్టు రూమ్ సీన్లు అయితే మరి బోరింగ్ గా ఉంటాయి. రొటీన్ ఫ్లాట్ తీసుకున్నప్పుడు ఒక థ్రిల్లర్లో అవసరమైన అబ్బుర పరిచే సన్నివేశాలు ఒక్కటంటే ఒక్కటి లేకపోవడం గమనార్హం. హీరో మాత్రం చాలా మంచి పర్ఫార్మన్స్ ఇచ్చాడు.