ఒప్పో కంపెనీ ఇటీవలే ఎఫ్17 ప్రొ పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే దాని కన్నా కొంచెం తక్కువ ధరకు, దాదాపుగా అందులో ఉన్న లాంటి ఫీచర్లతోనే మరో కొత్త ఫోన్‌ను గురువారం విడుదల చేసింది. ఒప్పో ఎఫ్ 17 పేరిట మార్కెట్లో కొత్త ఫోన్ లాంచ్ అయింది. ఇందులో ఇచ్చిన ఫీచర్లు కూడా యూజర్లను ఆకట్టుకుంటున్నాయి.
ఒప్పో ఎఫ్17 స్మార్ట్ ఫోన్ లో 6.4 ఇంచుల సూపర్ అమోలెడ్ డిస్ప్లేను ఇచ్చారు. అందువల్ల డిస్ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. ఈ డిస్ప్లేకు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంది. ఈ ఫోన్ లో ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 662 ప్రాసెసర్‌ను అమర్చారు. అందువల్ల ఫోన్ పనితనం బాగుంటుంది. ఈ ఫోన్ 6, 8 జీబీ ర్యామ్ ఆప్షన్లలో లభిస్తోంది. రెండింటిలోనూ 128 జీబీ స్టోరేజ్ లభిస్తుంది.
ఈ ఫోన్ లో మెమొరీని 512 జీబీ వరకు కార్డు ద్వారా పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. వెనుక వైపు 16 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాతోపాటు 8, 2, 2 మెగాపిక్సల్ కెమెరాలు మరో మూడు ఉన్నాయి. ముందు వైపు 16 మెగాపిక్సల్ కెమెరాను ఇచ్చారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. రెండు 4జి సిమ్‌లను వేసుకోవచ్చు. బ్లూటూత్ 5.0 అందుబాటులో ఉంది. యూఎస్బీ టైప్ సి పోర్టును ఇచ్చారు. 4015 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. దీనికి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను ఇచ్చారు.
* ఒప్పో ఎఫ్ 17 ఫోన్ 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.17,990.
* 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.19,990.
సెప్టెంబర్ 21 నుంచి ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.