రియల్‌మి కంపెనీ వినియోగదారులను ఆకట్టుకునేలా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోన్స్ ను మార్కెట్లో విడుదల చేస్తుంటుంది. ప్రీమియం ఫోన్లలో ఉండే ఫీచర్లను తన ఫోన్లలో రియల్‌మి అందిస్తుంది. అందుకనే ఆ కంపెనీ ఫోన్లంటే మొబైల్ వినియోగదారులు ఎల్లప్పుడూ ఆసక్తిని చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే రియల్‌మి కంపెనీ భారత్‌లో కొత్తగా రియల్‌మి 7 సిరీస్ ఫోన్స్‌ను విడుదల చేసింది. రియల్‌మి 7, రియల్‌మి 7 ప్రొ పేరిట ఆ ఫోన్స్ ను లాంచ్ చేసింది. వీటిల్లో అద్భుతమైన ఫీచర్లను ఇచ్చారు. ధర కూడా అందుబాటులోనే ఉండడం విశేషం.
రియల్‌మి 7 స్మార్ట్ ఫోన్లో.. 6.5 ఇంచుల డిస్ప్లేను ఇచ్చారు. దీనికి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి95 ప్రాసెసర్‌ను ఇచ్చారు. 6,8 జీబీ ర్యామ్, 64, 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో ఈ ఫోన్ లభిస్తోంది. మెమొరీని కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకోవచ్చు. రెండు 4జి సిమ్‌లను వేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఇచ్చారు. వెనుక వైపు 64 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాకు తోడు 8, 2, 2 మెగాపిక్సల్ కెపాసిటీ కలిగిన మరో మూడు కెమెరాలను ఇవ్వగా, ముందు వైపు 16 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను పక్క వైపుకు ఇచ్చారు. యూఎస్బీ టైప్ సి పోర్టు ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో ఇచ్చారు. ఈ బ్యాటరీ గంటలోనే ఫుల్ చార్జ్ అవుతుంది.
రియల్‌మి 7 ప్రొ స్మార్ట్ ఫోన్లో.. 6.6 ఇంచుల డిస్ప్లేను ఇచ్చారు. ఇందులో ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 720జి ప్రాసెసర్‌ను అమర్చగా, ఈ ఫోన్ 6, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో లభిస్తోంది. మెమొరీని 256 జీబీ వరకు కార్డు ద్వారా పెంచుకోవచ్చు. రెండు 4జి సిమ్‌లను వేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌ను ఇచ్చారు. వెనుక వైపు 64 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాకు తోడు 8, 2, 2 మెగాపిక్సల్ కెమెరాలు మూడు ఉన్నాయి. ముందు వైపు 32 మెగాపిక్సల్ కెమెరాను ఇచ్చారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. డాల్బీ అట్మోస్ ఫీచర్‌ను ఇచ్చారు. యూఎస్బీ టైప్ సి పోర్టు ఉంది. 4500 ఎంఏహెచ్ బ్యాటరీని ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో ఇచ్చారు. ఈ బ్యాటరీ కేవలం అరగంటలోనే ఫుల్ చార్జ్ అవుతుంది.
* రియల్‌మి 7 ఫోన్ 6జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.14,999
* రియల్‌మి 7 ఫోన్ 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.16,999
* రియల్‌మి 7 ప్రొ ఫోన్ 6జీబీ ర్యామ్ మోడల్ ధర రూ.19,999
* రియల్‌మి 7 ప్రొ ఫోన్ 8జీబీ ర్యామ్ మోడల్ ధర రూ.21,999
సెప్టెంబర్ 10 నుంచి రియల్‌మి 7 ఫోన్, 14వ తేదీ నుంచి రియల్‌మి 7 ప్రొ ఫోన్లు ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి వెబ్సైట్లలో లభిస్తాయి.