NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Congress Protests: హైదరాబాద్ రాజ్‌భవన్ వద్ద కాంగ్రెస్ శ్రేణుల నిరసన..! ఎక్కడికక్కడ నేతల అరెస్టుపై కాంగ్రెస్ నేతల ఫైర్..!!

Congress Protests: పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన చలో రాజ్ భవన్ కార్యక్రమానికి తెలంగాణ పోలీసులు అనుమతి నిరాకరించారు. ఇందిరా పార్క్ వద్ద 200 మంది తో సమావేశం నిర్వహణకు మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు చలో రాజ్ భవన్ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి బయలుదేరిన పార్టీ నేతలను పోలీసులు ముందస్తుగా పోలీసులు ఇళ్ల వద్దే నిర్బంధించారు. కార్యకర్తలు తరలి వెళ్లకుండా ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. అయనప్పటికీ ఎమ్మెల్యేలు సీతక్క, జగ్గారెడ్డి ఇతర కాంగ్రెస్ నాయకులు ఇందిరా పార్క్ వద్ద కు చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చారు.

Congress Protests over hike petrol and diesel prices
Congress Protests over hike petrol and diesel prices

Read More: Revanth Reddy: రేవంత్ రివర్స్ ఆపరేషన్ ఆకర్ష్..! సక్సెస్‌ సంకేతాలు వస్తున్నట్లేగా..?

కొందరు యూత్ కాంగ్రెస్ నేతలు రాజ్ భవన్ వద్ద హాల్ చల్ చేశారు. రాజ్ భవన్ మెయిన్ గేటుకు పార్టీ జండాలు తగిలించి ఆందోళన చేశారు. ఇందిరా పార్క్ వద్దకు కొద్దిసేపటిలో రేవంత్ రెడ్డి చేరుకోనున్నారు. కాంగ్రెస్ చలో రాజ్ భవన్ నేపథ్యంలో రాజ్ భవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పోలీసులు తమ నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకోవడం పట్ల టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిరసన తెలిపేందుకు వస్తున్న నేతలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం నియంతృత్వ ధోరణిని కనబరుస్తోందని, ఇతర జిల్లాల నుండి కార్యకర్తలు రాకుండా అడ్డుకోవడం ఏమిటని నిలదీశారు మల్లు రవి. ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు అనుమతి ఇచ్చి మళ్లీ కార్యకర్తలను అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. గృహ నిర్బంధాలు, అరెస్టు లు చేయడం రాచరిక పాలనకు నిదర్శనమని ఆక్షేపించారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని మల్లు రవి డిమాండ్ చేశారు.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju