NewsOrbit
తెలంగాణ‌ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Kcr Rahul: రాహుల్ గాంధీకి కేసీఆర్ మద్దతు..! వ్యూహంలో భాగమేనా..!?

kcr supports rahul gandhi

Kcr Rahul: వందేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి రాజకీయ ప్రత్యర్ధులెక్కువే. ఆ పార్టీలో అగ్ర నేతలుగా ఎదిగిన కొందరు తమ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు పెట్టి అధికారంలోకి వచ్చారు కూడా. అలా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వచ్చిన పార్టీ తెలుగుదేశం. టీఆర్ఎస్ పార్టీతో 2004లో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. ఆ తర్వాత కాంగ్రెస్ కు తెలంగాణలో శత్రువుగా మారింది. మొత్తంగా ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ కు వ్యతిరేకమే. తెలంగాణలో కేసీఆర్ ధాటికి కాంగ్రెస్ కుదేలవగా.. ఏపీలో ప్రజా వ్యతిరేకతతో కాంగ్రెస్ తీవ్రంగా నష్టపోయింది. అయితే.. టీడీపీ 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని పెద్ద తప్పే చేసింది. ఇప్పుడు రాహుల్ గాంధీ వాదనను కేసీఆర్ సమర్ధిస్తున్నారు. దీని పరిణామమేంటి..?

kcr supports rahul gandhi
kcr supports rahul gandhi

కాంగ్రెస్ కు కేసీఆర్ వ్యతిరేకమే.. కానీ..

కేసీఆర్ కూడా కాంగ్రెస్ కు వ్యతిరేకమే. ప్రత్యేక రాష్ట్రం కోసం కాంగ్రెస్ తో జత కట్టిన కేసీఆరే తర్వాత కాంగ్రెస్ తో విభేధించారు. కాంగ్రెస్ అగ్రనేతలందరినీ విమర్శించారు. పార్లమెంట్ లో ప్రధాని మోదీని రాహుల్ కౌగిలించుకుంటే ఓ సందర్భంలో విమర్శించారు కూడా..! అటువంటి కేసీఆర్.. ఇప్పుడు రాహుల్ ను వెనకేసుకొచ్చారు. సర్జికల్ స్ట్రైక్ జరిగిందనేదానికి ఆధారమేంటి..? అని ప్రశ్నించిన రాహుల్ పై బీజేపీ నేతలు విమర్శలు చేస్తుంటే.. రాహుల్ ప్రశ్నలో తప్పేముంది..? ఆయన కుటుంబాన్ని అవమానిస్తారా..? అని మండిపడ్డారు. నేను కూడా ఆధారాలు చూపమనే అడుగుతున్నా.. అని అన్నారు. ఇవన్నీ కేంద్రంలో బీజేపీని గద్దె దించేందుకు కాంగ్రెస్ ను కలుపుకుంటారా..? అనే ఊహాగానాలకు తావిచ్చాయి.

టీడీపీకి జరిగింది ఇదే..

ఇదే జరిగితే ఫలితమెలా ఉంటుందనేది ఓ ప్రశ్న. ఇందుకు నిదర్శనంగా.. సగటు తెలుగు వ్యక్తి టీడీపీ-కాంగ్రెస్ పొత్తును అసలు ఊహించరు. కానీ.. చంద్రబాబు చేశారు. దీంతో.. ‘టీడీపీతో పొత్తు పెట్టుకుని వచ్చే ఓట్లు, సీట్లు కూడా పోగొట్టుకున్నాం..’ అని టీకాంగ్రెస్ నేతలే వ్యాఖ్యానించే పరిస్థితులు వచ్చాయి. తెలంగాణలో టీఆర్ఎస్-కాంగ్రెస్ పరిస్థితి ఇంతే. రాహుల్ కు కేసీఆర్ వ్యక్తిగత మద్దతు మాత్రమే ఇచ్చినా.. రాజకీయ విమర్శలు, అనుమానాలు ఆగలేదు. బీజేపీ నాయకులు విమర్శలు కూడా చేశారు. నిజంగా.. బీజేపీకి వ్యతిరేక పోరాటంలో భవిష్యత్తులో కేసీఆర్ కాంగ్రెస్ ను కలుపుకుంటే.. సాధిస్తారా..? ఏం జరుగుతుందనేది చూడాల్సి ఉంది.

 

 

 

author avatar
Muraliak

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju