NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ బిగ్ స్టోరీ

Telangana Election 2023: మోడీ ‘ఎన్నికల’ హామీలు .. ఆ సామాజికవర్గాల ఓట్లు గుంప గుత్తగా ఆకర్షించినట్లేనా..?

Telangana Election 2023: ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలన్నా ప్రధానంగా అత్యధిక జనాభా కల్గిన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలను ఆకట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతం రాజకీయ పార్టీలు అదే ఫార్మలాను అమలు చేస్తున్నాయి. గతంలో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని ఆ పార్టీ అధినేత కేసిఆర్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ హామీని బుట్టదాఖలు చేసినా దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని దళిత బంధు పథకాన్ని కేసిఆర్ ప్రవేశపెట్టి ఆ వర్గాన్ని మచ్చిక చేసుకునే ప్రయత్నం చేశారు. 2014 పార్లమెంట్ ఎన్నికల ప్రచారం లో బిజెపి అధికారం లోకి రాగానే వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేపడతామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ నీటి మీద రాతలుగానే అయ్యింది.

ఎస్సీ నేత రామ్ నాథ్ కోవింద్ ను, గిరిజన మహిళ ద్రౌపది ముర్మూను రాష్ట్రపతి చేశామని బీజేపీ ప్రకటిస్తుండగా, దళిత సామాజికవర్గ నేత మల్లికార్జున ఖర్గే ను పార్టీ జాతీయ అధ్యక్షుడుగా చేశామని కాంగ్రెస్ చెప్పుకొంటోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో మతం కార్డుతో రాజకీయాలు చేస్తుందన్న పేరున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ).. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండటం, మత పరమైన సెంటిమెంట్ లు లేకపోవడంతో బీసీ, ఎస్సీ వర్గాలను దగ్గర చేసుకునే ప్రయత్నాలు మొదలు పెట్టింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. బీజేపీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందన్న రాష్ట్రాల్లో ఎక్కడా బీసీ నేతను ముఖ్యమంత్రిగా చేస్తామని ప్రకటించని బీజేపీ.. తెలంగాణ ఎన్నికల్లో మాత్రం బీసీ నేతను ముఖ్యమంత్రిగా చేస్తామని చేస్తామని ప్రకటించడం ఇది ఒక రాజకీయ ఎత్తుగడే అని అంటున్నారు.

అదే క్రమంలో విశ్వరూప మహాసభకు ప్రధాని మోడీ హజరై చేసిన ప్రసంగం చూస్తే తెలంగాణలో అత్యధికంగా ఉన్న మాదిగ సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవడం కోసమేననే మాట వినబడుతోంది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఆయా సామాజిక వర్గాల డిమాండ్స్ లను అధికారం లోకి రావటానికి  వేదికగా ఉపయోగించు కుంటున్నాయి అని చెప్పవచ్చు. ఎన్నికల అనంతరం కోర్టు కేసులు, వివాదాల చూపుతూ కాలయాపన చేస్తూ ఉంటారు. కమిటీలతో కాలయాపన షరా మామూలే. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో బీసీ వర్గాలను ఆకట్టుకునేందుకు బీసీ నేతను ముఖ్యమంత్రి చేస్తామని బీజేపీ ప్రకటించింది. స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇటీవల హైదరాబాద్ లో జరిగిన బీసీ ఆత్మగౌరవ సభలోనూ ప్రకటించారు.

తాజాగా తెలంగాణలో అత్యధికంగా ఉన్న ఎస్సీల్లోని మాదిగ సామాజిక వర్గం ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విశ్వరూప మహాసభకు హజరై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిక పోరాటాన్ని ప్రసంశించారు. అండగా ఉంటానన్నారు. తన చిన్న సోదరుడుతో మంద కృష్ణ సమానమన్నారు. ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 30 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ పోరాటం జరుగుతున్నది. ఎస్సీ వర్గీకరణకు అన్ని పార్టీలు అనుకూలమే కానీ అమల్లోకి మాత్రం రావడం లేదు. అన్ని పార్టీలు ఇదిగో, అదిగో అంటూ దోబూచులాట ఆడుతూ అవకాశ వాద రాజకీయాలు చేస్తున్నాయి. ఎస్సీ లకు అందుతున్న రిజర్వేషన్ కోటాలో వర్గీకరణ జరగాలన్నది ఏమార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ ప్రధాన డిమాండ్.

బిసి కులం లో ఉన్న వర్గీకరణ ఎస్సీ కులంలో ఉండాలనీ ఆయన మొదట నుంచి పోరాటం చేస్తున్నారు. ఎస్సీ కులాల్లో మాల, మాదిగ, రెళ్ళీ, అది ఆంధ్ర తదితర ఉప కులాలు ఉన్నాయి. ఎస్సీ జనాభాలో అత్యధికంగా ఉన్నది మాదిగ సామాజిక వర్గం. కానీ ప్రభుత్వ ఉద్యోగాల్లో మాదిగల శాతం కంటే మాలలు అత్యధికంగా ఉన్నారు. 1997 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో ఎస్సీ వర్గీకరణకు ఒక అడుగు ముందుకు వేశారు. ఎస్సీ వర్గీకరణకు ఒక జీవో ను తీసుకువచ్చారు. ఎస్సీ లో ఉన్న ఉప కులాలను  ఏ, బి, సి, డి గా వర్గీకరించారు.

ఏ వర్గం లో రెళ్లీ కులస్థులు సహా 12 ఉప కులాలకు ఒక  శాతం, బి వర్గం లో మాదిగలతో సహా మరో 18 ఉప కులాలకు 7 శాతం, సీ వర్గంలో మాలలతో సహా మరో 25 ఉప కులాలకు కలిపి 6 శాతం, డి వర్గంలో ఆది ఆంధ్ర సహా మరో నాలుగు ఉప కులాలకు ఒక శాతం రిజర్వేషన్ లు అమలు చేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మాల నాయకులు ఎస్సీ ల ఐక్యతను వర్గీకరణ దెబ్బతీస్తుందంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. వీరు సుప్రీం కోర్టును ఆశ్రయించగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్ర పరిధి దాటి తీసుకున్న నిర్ణయం అని ఎస్సీ వర్గీకరనకు తీసుకొచ్చిన జీవో ను కొట్టివేసింది. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి కూడా ఎస్సీ వర్గీకరణకు ఉషా మేహత్రా కమిటీ ని నియమించారు. అది అమలు కాలేదు.

ఇప్పుడు తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్సీ వర్గీకరణ అంశం మరో సారి తెరపైకి వచ్చింది. హైదరాబాద్ లో జరిగిన అణగారిన వర్గాల విశ్వరూప మహాసభలో  ఎస్సీ వర్గీకరణ కు కమిటీ వేస్తామని మోడీ  ప్రకటించారు. ఎంఆర్పీఎస్ చేస్తున్న ఉద్యమంలో న్యాయం ఉందని అన్నారు మోడీ. ఇదే సందర్భంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లను విమర్శించారు మోడీ. ప్రధాన మంత్రి హోదాలో నరేంద్ర మోడీ ఏపీలో అమరావతి రాజధాని నిర్మాణానికి శిలాఫలకం వేసి ఏళ్లు గడుస్తున్నా అతీగతీ లేదు.

అమరావతి రాజధాని విషయంలో రాష్ట్ర బీజేపీ ఒక మాట, కేంద్రం మరో మాటగా ఉండటం, జగన్మోహనరెడ్డి సర్కార్ మూడు రాజధానుల కన్సెప్ట్ తీసుకురావడంతో ప్రస్తుతం ఏపీకి రాజధాని ఏది అంటే చెప్పలేని పరిస్థితి ఉంది. ఇవి ఇలా ఉంటే తెలంగాణ ఎన్నికల సందర్భంలో ప్రధాని నరేంద్ర మోడి బీసీ, ఎస్సీ (మాదిగ) సామాజికవర్గం ఆకట్టుకునేందుకు ఇచ్చిన హామీలు ఓట్లు రాలుస్తాయా లేదా అనేది తెలియాలి అంటే మరో నెల రోజులు ఆగాల్సిందే.

Telangana Election 2023: బీఆర్ఎస్ లో చేరిన పాల్వాయి స్రవంతి .. కాంగ్రెస్ పై మంత్రి కేటిఆర్ సెటైర్ లు

Related posts

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N