NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

సీఎం కేసిఆర్ పాలనా తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన వైఎస్ షర్మిల… ఒకే వ్యక్తికి 80 శాతం కాంట్రాక్ట్ పనులు ఎందుకో..?

తెలంగాణలో సీఎం కేసిఆర్ పాలనా తీరుపై వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శించారు. కోటి ఎకరాలకు నీరు అందిస్తామన్న పేరుతో కేసిఆర్ .. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించి ఆంధ్రా కాంట్రాక్టర్లకు వేల కోట్లు దోచిపెట్టారని షర్మిల ఆరోపించారు. ఎనిమిదేళ్ల పాలనలో భద్రాచలం కరకట్ట పనులు ఎందుకు పూర్తి చేయలేకపోయారని కేసిఆర్ పై మండిపడ్డారు. ప్రజలు, వర్షాల్లో మునిగి నష్టపోతే కట్టమీద నిలబడి క్లౌడ్ బరస్ట్, పోలవరం ప్రాజెక్టు వల్లే నష్టం అంటూ పిట్టకధలు చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నారని సీఎం కేసిఆర్ ను విమర్శించారు. వరద ప్రాంతాల్లో తాను పాదయాత్ర చేపట్టి ప్రజల సమస్యలు తెలుసుకుంటాననీ, కేసిఆర్ ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తామని పేర్కొన్నారు. వరదలు వచ్చి భద్రాచలం, ములుగు ప్రాంతాలు మునిగిపోవడానికి సీఎం కేసిఆర్ అసమర్ధతే కారణమని మండిపడ్డారు షర్మిల.

నాడు ఉమ్మడి రాష్ట్రంలో సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కాంట్రాక్ట్ పనులు ఒక్క వ్యక్తికే కాకుండా అందరికీ ఇచ్చి ప్రోత్సహించి అందరివాడుగా పేరు తెచ్చుకున్నారనీ, కానీ కేసిఆర్ మాత్రం తన మనిషి అయిన మేఘా కృష్ణారెడ్డికి రాష్ట్రంలో 80 శాతం పనులు అప్పగించారని, తనకు ఏమి లాభం లేకపోతే అన్ని పనులు ఆయనకే ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు మిషన్ భగీరత, మన ఊరు మన బడి, రోడ్ల పనులు, ఆర్ టీ సీ పనులు అనీ ఒకే వ్యక్తి మేఘా కృష్ణారెడ్డికి ఎందుకు కట్టబెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇందులో కేసిఆర్ కుటుంబానికి వాటా ఉందని షర్మిల ఆరోపించారు. వీటిని ప్రశ్నించాల్సిన కాాంగ్రెస్, బీజేపీ కూడా నోరు మెదపడం లేదని అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు కట్టకముందు ఎలాంటి సమస్యలు లేవని కట్టిన తర్వాతే ఎందుకు వస్తున్నాయని షర్మిల ప్రశ్నించారు. కాళేశ్వరంలో ఎంత నష్టం జరిగిందో ప్రభుత్వం దాచాలనుకున్నా అందరికీ తెలిసిపోయిందన్నారు. కాళేశ్వరం కట్టిన పాపానికి వేల ఎకరాలు మునిగిపోయాయనీ, రైతులకు ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. కడెం ప్రాజెక్టు గేట్లు మార్చాలన్న డిమాండ్లను సీఎం కేసిఆర్ పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ప్రాజెక్టు గేట్లు పని చేయకపోవడం వల్లే ఇంత పెద్ద వరద వచ్చిందని అన్నారు షర్మిల. 33 మంది సిబ్బంది ఉండాల్సిన కడెం ప్రాజెక్టు దగ్గర ముగ్గురే ఉన్నారని అన్నారు. వరదల్లో గూడు కోల్పోయిన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టివ్వాలని షర్మిల డిమాండ్ చేశారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N