NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల మరో సారి అరెస్టు

వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను మరో సారి పోలీసులు అరెస్టు చేశారు. ఆమె నిరసన కార్యక్రమాన్ని భగ్నం చేశారు. తన పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంపై నిరసనగా షర్మిల ట్యాంక్ బండ్ అందేద్కర్ విగ్రహం వద్ద ఆమరణ దీక్షకు దిగారు. ఆందోళనకు అనుమతి లేదంటూ వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని షర్మిల దీక్షను భగ్నం చేశారు. షర్మిల అరెస్టునకు పోలీసులు ప్రయత్నిస్తున్న సందర్భంలో పార్టీ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అడ్డుకోవడంతో ట్యాంక్ బంద్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

YS Sharmila Hunger Strike

సజ్జల: షర్మిల కోసమా..! కేసిఆర్ కోసమా..! ఈ మౌనం వెనుక అర్ధం ఏమిటి..?

ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడుతూ శాంతియుతంగా దీక్షచేస్తుంటే అరెస్టు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా స్వామ్యాన్ని కేసిఆర్ ఖూనీ చేస్తున్నారని అన్నారు. కేసిఆర్ పదేపదే తప్పులు చేస్తున్నారనీ, కేసిఆర్ పతనానికి ఇదే నాంది అని అని షర్మిల వ్యాఖ్యానించారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలను చుట్టుముట్టి ఆమెను అరెస్టు చేసి పోలీస్ వాహనంలో తరలించారు. ఇటీవల వరంగల్లు జిల్లాలో ఆమె పాదయాత్ర చేస్తున్న సమయంలో టీఆర్ఎస్ వర్గీయులు అడ్డుకుని ఆమె వాహనంపై దాడి చేసిన సంగతి తెలిసిందే. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు ఆమె పాదయాత్రను నిలువరించి అరెస్టు చేసి హైదరాబాద్ తరలించారు.

ఆ మరుసటి రోజు షర్మిల ప్రగతిభగన్ ముట్టడికి బయలుదేరగా మరో సారి అరెస్టు చేశారు. ఆమె వాహనంలోనే ఉండగా పోలీసులు క్రైన్ సహాయంతో పోలీస్ స్టేషన్ కు తరలించడం తీవ్ర సంచలనం అయ్యింది. పలు సెక్షన్ల పై ఆమెపై పోలీసులు కేసు నమోదు చేసి కోర్టు కు హజరుపర్చగా మెజిస్ట్రేట్ రిమాండ్ రిపోర్టును తిరస్కరించి బెయిల్ మంజూరు చేశారు. ఆ క్రమంలోనే తన పాదయాత్ర కొనసాగింపునకు హైకోర్టును ఆశ్రయించగా షరతులతో హైకోర్టు పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే వరంగల్లు పోలీస్ కమిషనర్ మాత్రం షర్మిల పాదయాత్రలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్న నేపథ్యంలో శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందంటూ పాదయాత్రకు అనుమతి నిరాకరించారు. ఈ క్రమంలో షర్మిల మరో సారి నిరసన కార్యక్రమానికి దిగడంతో మరో సారి అరెస్టు చేశారు.

TRS to BRS: తెలంగాణలో కాంగ్రెస్ పతనానికి బీజం పడి పదమూడు ఏళ్ళు

Related posts

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N