వ్యాపార భాగస్వామ్యం భార్యాభర్తల బంధం అని ఏ వేదంలో ఉంది పంతులుగారు.. ఇలా చెప్పించడం తప్పు కాద సామ్రాట్ గారు.. ఏ అర్హతలు లేని మా మమ్మీ ప్రాజెక్టుకి మీరు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు అని అభి అంటాడు.. ఈ ప్రాజెక్టు గురించి ఏం లాభం ఆశించారు అని అభి అంటాడు.. చూడు అభి మీ అమ్మను ఎంత తక్కువ అంచనా ఎందుకు వేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు.. మీ అమ్మలో ఎంతో సాధించాలని కోరుకుంటుంది.. ఆ తపన నీకు కనిపించడం లేదా.. కనపడవు ఎందుకంటే వాడు గుడ్డోడు.. కళ్ళు మూసుకుపోయినవి అని ప్రేమ అంటాడు.. సామ్రాట్ గారూ మామ్ కి దగ్గర అవ్వాలని ట్రై చేస్తున్నాడు.. అందుకే ఇదంతా చేస్తున్నాడు.. ఇప్పటికీ మీది మీకు అది అర్థం కావడం లేదు.. అభి అని పెద్దగా తులసి అరుస్తుంది..!!
నేను నిన్ను అనుమానించట్లేదు మామ్. ఆయన్ని అనుమానిస్తున్నాను చెప్పమని అడిగాడు.. చెప్పరా చెప్పాల్సిన అవసరం ఆయనకు లేదు అని వాళ్ళ మామయ్య వినోద్ అంటాడు.. నాకు తెలుసు రా నిన్ను రెచ్చగొట్టి మీ నాన్న నిన్ను ఇలా మాట్లాడిస్తున్నాడు పండగ లాంటి వాతావరణాన్ని చెడగొట్టేలాగా చేస్తున్నాడు.. మీ నాన్న మా అక్కను ఎదగకుండా చేశాడు.. ఇప్పుడు నిన్ను అడ్డం పెట్టుకొని మళ్లీ అదే పని చేస్తున్నాడు.. ఈ జన్మలో బాగుపడరా నాశనం అయిపోతారు అని తులసి వాళ్ళ తమ్ముడు వినోద్ అంటాడు.. తులసి గారి మాజీ భర్త నువ్వా.. అని సామ్రాట్ అడుగుతాడు.. ఇది నిజమా తులసి గారు అని సామ్రాట్ అంటాడు.. ఇప్పుడు సమస్య అది కాదు మా మామ గురించి మీరు ఏమనుకుంటున్నారో అది చెప్పండి సామ్రాట్ గారు అని అభి అంటాడు.. సామ్రాట్ ను చూస్తూ తులసి వాళ్ళ మామయ్య రెండు చేతులు ఎత్తి దండం పెడతాడు. క్షమించండి అని తులసి కూడా దండం పెట్టీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది..
నందు ఇంటికి రాగానే తన షర్టు తీసేస్తాడు ఏం లాభం అని లాస్య నందుని ప్రశ్నిస్తుంది.. షర్టు చించేస్తే నీ ఉక్రోషం తగ్గుతుందేమో.. నువ్వు మన జీవితాలకు నిప్పు పెట్టావు.. ఈ విషయం నీకు అర్థం అవుతుందా అని లాస్య నందుని ప్రశ్నిస్తుంది.. నేనేం చేశాను అని సామ్రాట్ అంటాడు.. మీకు అంత బుర్ర తెలియడం లేదా.. ఏం మాట్లాడవో నీకు అర్థం కాలేదా మనం ఏం నిజాన్ని అయితే సామ్రాట్ గారి దగ్గర చెప్పకూడదు అని అనుకున్నాము.. ఇప్పుడు అదే నిజాన్ని నీటి నోటితోనే నువ్వు చెప్పేసావు అని లాస్య అంటుంది.. ఆ దీపక్ గాడు రెచ్చగొట్టాడు అందుకే ఇలా చేశాను అని నందు అంటాడు.
దీపక్ ని అడ్డం పెట్టుకొని తులసి నిజాన్ని అందరూ ముందు బయటపెట్టించింది. తులసి వేసిన గాలానికి ఎరలా చిక్కుకున్నావు అని లాస్య అంటుంది.. ఇప్పుడు కూడా తను ఏం చేయదు తన చేతికి మట్టి కాకుండా అంతా సామ్రాట్ చేత చేయిస్తుంది.. ఆఫ్ట్రాల్ జాబు కోసం నా ఆహాన్ని చంపుకుని సామ్రాట్ పొందు నటించలేను లాస్య అని నందు అంటాడు.. నా కళ్ళ ముందు ఇందంతా జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకోను అని నందు అంటాడు..