బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి లవ్ స్టోరీతో ముందుకు సాగుతూ 543వ ఎపిసోడ్ లోకి. ఎంటర్ అయింది. ఇక ఈరోజు. ఎపిసోడ్ లో ఏమి. జరిగిందో తెలుసుకుందాం..కాలేజీలో పరీక్షల హడావుడి నడుస్తుంటుంది. అంతా సవ్యంగా జరిగేలా చూసుకుందాం అని మహేంద్ర, జగతి, మిగిలిన స్టాఫ్ కి చెప్పేసి రిషి వెళుతుండగా వసుధార ఎదురుపడి థ్యాంక్యూ సార్ అని చెబుతుంది. మనసులోనే సంతోషిస్తాడు రిషి.అటు వసుధార ఎగ్జామ్ హాల్లో కూర్చుని రిషి ఇచ్చిన పెన్ చూసుకుంటూ ఉండగా రిషి లోపలికి వచ్చి ఈ పరీక్షలు నీకే కాదు నాక్కూడా..నిన్ను నీ లక్ష్యం వైపు నడిపేందుకు ఎలాంటి త్యాగాలకైనా నేను సిద్ధం అనుకుంటాడు.
నాపై నాకన్నా మీకే ఎక్కువ నమ్మకం ఉంది అది నిలబెట్టుకుంటాను సార్ అంటుంది వసు
వసుధారకు తోడుగా ఉంటానంటున్న రిషి :
నీ నీడలా ఎప్పటికీ నీ తోడుగా ఉంటాను ఇదే రిషి వాగ్ధానం అనుకుంటాడు.రిషి వెళ్లిపోయిన తర్వాత పరీక్ష రాసుకుంటుంది వసుధార. ఇక వసు పరీక్ష ఎలా రాసిందో ఫోన్ చేసి మాట్లాడదామా వద్దా అనుకుంటాడు.తనైనా అర్థం చేసుకుని మెసేజ్ పెట్టొచ్చు కదా అనుకుంటండగా ఈలోపు గౌతమ్ వస్తాడు. నీలో నువ్వే మాట్లాడుకోవాలా మాతో కూడా మాట్లాడొచ్చు కదా..నీ మానసిక పరిస్థితిని ఫ్రెండ్ గా నేను అర్థం చేసుకుంటానంటాడు. సర్లే అని వసుకు కాల్ చేస్తాడు గౌతమ్.తిన్నాదా అడుగు అని సైగ చేస్తాడు. వసు.తిన్నాను అంటుంది.పరీక్ష ఎలా రాశావ్ అని గౌతమ్ అడుగుతాడు. బానే రాసా అంటుంది.రేపటి పరీక్షకు చదవాలి సార్. కాసేపు రిలాక్సేషన్ కోసం మా ఫ్రెండ్ తో మాట్లాడుకోవాలి.. గౌతమ్, రిషి షాక్ అయి చూస్తుండగా చందమామతో అని చెబుతుంది.
వసు ఎగ్జామ్ ఎలా రాసిందో ఆమె టెన్షన్లో రిషి :
సీన్ కట్ చేస్తే రెండో పరీక్ష జరుగుతుంటుంది. వసు చుట్టూనే రిషి తిరుగుతూ ఉంటాడు..రిషిని చూస్తూ పరీక్ష రాస్తుంటుంది వసుధార. అలా పరీక్షలు జరుగుతుంటాయి. ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వచ్చిన వసు-పుష్పని చూసిన రిషి.. పుష్పతో మాట్లాడుతున్నట్టు వసుతో మాట్లాడతాడు.
హాల్లో వసు గురించి డిస్కస్ చేస్తున్న జగతి:
ఇక మహేంద్ర, జగతి మాత్రం పరీక్షలు అయిపోతే వసు-రిషి మధ్య గ్యాప్ వస్తుందని మనసులో అనిపిస్తోంది అని బాధ పడతారు ఇద్దర్నీ ఒక్కటి చేసేది ఎలా అని ఆలోచిస్తారు ఇంతలో రిషి, గౌతమ్ వస్తారు..వెళదాం డాడ్ అని రిషి అంటే..ఓ కాఫీ తాగి వెళదాం అంటాడు మహేంద్ర.ఇంతలో దేవయాని ఎంట్రీ ఇస్తుంది.మన కాలేజీ సాధించే విజయాలకు పెద్దమ్మ చాలా సంతోషిస్తారు తెలుసా అంటాడు రిషి.
రిషి, వసులను ఎలా విడదీయాలని చూస్తున్న దేవయాని:
ఇంతలో మహేంద్ర మొన్న ఫేర్ వెల్ పార్టీకి స్వీట్స్ చేయించినట్టే ఈసారి ఎలాంటి సర్ ప్రైజ్ ఇస్తారో
వదినా అంటాడు.నాకేం వద్దు ..నీకు ఏమైనా కావాలా రిషి అంటే చూశారా డాడ్..పెద్దమ్మ నాగురించే ఆలోచిస్తుంటుంది అంటాడు. సర్లేగాని ఈ పరీక్షలు అవగానే మీకో గుడ్ న్యూస్ చెబుతానంటాడు. ఇప్పుడే చెప్పొచ్చుకదా అంటే వసుధార గొప్ప విజయం సాధించి, కాలేజీకి మంచి పేరు తెస్తుంది కదా అంతకన్నా గుడ్ న్యూస్ ఏముంటుంది చెప్పండి అనేసి పదండి అంటాడు రిషి.అందరి మనసుల్లో ఆ వసుధార ఉంది..ఈ ఇంటి సొంత మనిషిలా చూస్తున్నారు ఏం చేయాలి..వసుధార అన్న పేరు, ఆలోచనే రిషి మనసులో లేకుండా చేయాలి అనుకుంటుంది దేవయాని.