బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 549వ ఎపిసోడ్ లోకి. ఎంటర్ అయింది. ఇక ఈరోజు ప్రసారం. కానున్న ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం..ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే దేవయాని, సాక్షితో నిశ్చితార్థం ఆగిపోయినప్పటి నుంచి ఇంట్లో ఏ శుభకార్యము జరగలేదు.అందుకే జగతి మహీంద్రల పెళ్లిరోజును ఘనంగా జరపాలని. అనుకుంటున్నా అని వసుతో అంటుంది దేవయాని దానికి నువ్వే రిషినీ ఒప్పించాలి అని వసుతో అంటుంది.
దేవయాని సరికొత్త ప్లాన్ :
నేను రిషిని అడిగితే రిషి ఒప్పుకుంటాడు కానీ, జగతి మహీంద్రలు సంతోషంగా చేసుకోలేరు. కనుక రిషి చేస్తే బాగుంటుంది అంటుంది దేవయాని..సరే మీరు చెప్పింది మంచే మేడం,రిషి సార్ నీ ఒప్పించడానికి నేను ప్రయత్నిస్తాను అని అంటుంది వసుధార. అప్పుడు దేవయాని మనసులో, ఈ మాత్రం నిప్పు పెడితే మంటలు వచ్చేలా నేను చేస్తాను అనుకుంటుంది. అంతలో రిషి అక్కడికి వస్తాడు.మీరేంటి పెద్దమ్మ ఇక్కడికి వచ్చారు అని అనగా వసుధార ఎలా ఉన్నాదో చూసి వెళ్దాం అని వచ్చాను అని అంటుంది దేవయాని.
డేట్ కి వచ్చిన వసు, రిషి :
సీన్ కట్ చేస్తే గౌతమ్ ప్లాన్ చేసి వసు, రిషిని ఒకచోట కలిసేలా చేస్తాడు అక్కడ బెలూన్లతో డెకరేట్ చేసి మధ్య ఒక టేబుల్ అలంకరించి ఉంటుంది. అక్కడికి ఇద్దరు వెళ్లి కూర్చుంటారు. అప్పుడు వసు రిషి తో, చాలా బాగుంది కదా సార్ ఇక్కడ. అలా ఇద్దరు కాసేపు మాట్లాడుకుని మనసులోని ప్రేమను ఒకరికి ఒకరు తెలుపుకుంటూ జరిగిపోయిన సంఘటనలను గుర్తు చేసుకుంటూ ఉంటారు.. కాసేపటికి ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతారు.
అమ్మా నాన్న పెళ్లి వేడుకను రిషి సెలెబ్రేట్ చేస్తాడా..?
అయితే మహేంద్ర, జగతి తమ పెళ్లి రోజు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. జగతి మాత్రం మహేంద్ర పెళ్లి రోజు వేడుకలు అలా ఏమి వద్దు. రిషి మనసు బాధ పడుద్ది. ఆ విషయం గురించి మర్చిపో అంటుంది.జగతి అన్నా మాటలు రిషి వింటాడు.ఇక వసును కలిసిన రిషి… ప్రేమ అనేది మనసులో ఉంటే చాలు కదా బయట సెలెబ్రేషన్స్ చేస్తేనే ఉన్నట్టా అంటాడు. అలా ఏమి కాదు సార్ వాళ్ళ పెళ్లి రోజు వేడుక మీరు చేస్తే అది వాళ్ళకి ఒక సంబరం సార్ అని అనడంతో రిషి ఆలోచనలో పడతాడు.