Telugu TV Serials

ఒకే బస్సులో కలిసి ప్రయాణం చేయనున్న తల్లి కూతుళ్లు.. అమెరికా వెళ్లిపోతున్న సౌందర్య కుటుంబం..!

Share

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 1433 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు ప్రసారం కానున్న ఆగష్టు 17 ఎపిసోడ్ లో ఏమి జరగనుందో ముందుగానే తెలుసుకుందాం.. వారణాసి వచ్చి సౌందర్య వాళ్లకు గతం చెప్పడంతో సీరియల్ మరింత ఆసక్తికరంగా సాగుతుందనే చెప్పాలి. అందరు అనుకున్నట్టు ఆక్సిడెంట్ లో దీప, కార్తీక్ లు చనిపోలేదు.కోమాలో నుంచి బయటకు వచ్చిన దీపను ఒక డాక్టర్ కాపాడి తన ఇంటికి తీసుకుని వెళ్లి తన తల్లికి పరిచయం చేస్తాడు.ఈ క్రమంలోనే నేటి ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా ముందుకు సాగిందనే చెప్పాలి. ఇంటికి వచ్చిన డాక్టర్ తన తల్లితో ‘అమ్మా చెల్లిని ఇంటికి తీసుకొస్తున్నా అని చెప్పాను కదా.. ఇదిగో నీ కూతురు’ అంటాడు డాక్టర్. ఆమె చాలా ప్రేమగా దీప దగ్గరకు వెళ్లి అమ్మా నువ్వేనా? నీ గురించి మేము మాట్లాడుకోని రోజు లేదు. నువ్వు కోమాలో ఉన్నప్పుడు ప్రతి రోజు నీ గురించే చెప్పేవాడు వీడు. నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు అమ్మా అంటుంది ఆ పెద్దావిడ

డాక్టర్ ఇంటికి వచ్చిన దీప :

ఇక డాక్టర్ వాళ్ల తల్లి.. ‘రేయ్ రామ్ పండు అని పిలవగానే ఇద్దరు పనివాళ్లు వస్తారు.వాళ్ళను దీపకు పరిచయం చేస్తాడు డాక్టర్.వీడి పేరు రామ్.. వాడి పేరు పండు.ఇద్దరినీ కలిపి అమ్మా రామ్ పండు అని పిలుస్తుంది అంటాడు. ఆ మాటలకు దీప నవ్వుతుంది. ఇంటికి అతిథులు వచ్చారు.మంచిగా ఏదైనా వండి పెట్టండ్రా.. మాకు గతి లేదు.. మీకు మతి ఉండదు.. తప్పక మీరు చేసేవి తినాల్సి వస్తోంది. ఈ రోజైనా మంచిగా వండండి అంటుంది. దాంతో దీప వంట గది ఎక్కడా?’ అంటుంది. ‘నీకు వంట వచ్చా అని అయినా నీకెందుకమ్మా శ్రమా’ అంటారు డాక్టర్, డాక్టర్ వాళ్ల తల్లి. అప్యాయంగా చేరదీసిన మీకు కనీసం రుచికరమైన భోజనం కూడా వండి పెట్టలేనా అంటుంది దీప.

హైదరాబాద్ వెళ్ళడానికి సౌర్య ఒప్పుకుంటుందా..?

ఇక చిన్న సౌర్య ఓ ఇంట్లో కోపంగా కూర్చుని ఉంటుంది.ఇక ఇద్దరూ కాస్త బయపడుతూ సౌర్య దగ్గరకు వచ్చి ‘ఎందుకమ్మా కోపం’ అంటూ మాట కలుపుతారు. మరి ఆ ఇంటికి వెళ్లమంటే ఎలా? నేను వెళ్లను.మీకు నచ్చకపోతే చెప్పండి.ఇక్కడి నుంచి కూడా వెళ్లిపోతాను.అంతే కానీ.. ఆ ఇంటికి వెళ్లమని చెప్పొద్దు’ అంటుంది సౌర్య. అలా కాదమ్మా నీకు హిమ నచ్చకపోతే నాన్నమ్మా తాతయ్య ఏం పాపం చేశారు? వాళ్లని ఎందుకు బాధపెట్టాలి. వాళ్లని ఎందుకు వదిలేసుకోవాలి?చెప్పు.నువ్వేమి మాకు భారం కాదు తల్లి.. మాకు ఓ పాప ఉండేది నాలుగు నెలలకే మాకు దూరమైపోయింది. ఆ పాప గుర్తు వచ్చినప్పుడల్లా ఇప్పటికీ ఏడుస్తునే ఉన్నాం. అలాంటిది ఇన్నేళ్లు పెంచిన బిడ్డ దూరమైతే నీ వాళ్ల ఎంత ఏడుస్తారు ఒకసారి అర్థం చేసుకోరా.. రేపు హైదరాబాద్ వెళ్దాం’ అంటూ ప్రేమగా నచ్చజెబుతారు. దాంతో సౌర్య సరేనంటుంది.

వంటలక్కా మజాకానా అనిపించిన దీప :

సీన్ కట్ చేస్తే డాక్టర్ ఇంట్లో వంటలన్నీ దీపే చేస్తుంది.డాక్టర్, డాక్టర్ తల్లి, రామ్, పండు అంతా దీప వంట బాగుంది అంటూ లొట్టలేసుకుంటూ తింటారు. ‘మీరు నాకంటే రుచిగా చేయగలరు అమ్మా’ అంటుంది దీప డాక్టర్ వాళ్ల అమ్మతో. ‘వండగలను కానీ ఎక్కడా నా డాక్టర్ కొడుకు వెళ్లనిస్తే కదమ్మా.ఆ వేడి తగలొద్దు,ఆ పొగ పీల్చొద్దు అంటాడు. దాంతో దీప గతంలోకి వెళ్ళిద్ది.దీపకు ఆరోగ్యం చెడిపోయినప్పుడు కార్తీక్ తనపట్ల తీసుకున్న జాగ్రత్తలన్ని గుర్తొచ్చి కన్నీళ్లు వస్తాయి. అది చూసిన పెద్దావిడ ఏమైంది తల్లీ’ అంటుంది.బాధతో నిండిన గుండె ప్రతి జ్ఞ‌ాపకాన్ని కన్నీరుగా మార్చేస్తుంది’ అంటాడు డాక్టర్.అవునమ్మా రేపు హైదరాబాద్ వెళ్తున్నావ్ కదా?’ అంటాడు. ఊ అన్నట్లుగా తలాడిస్తుంది దీప. ‘ఇప్పుడు హైదరాబాద్ ఎందుకు తల్లి’ అంటుంది ఆ పెద్దావిడ. ‘పిల్లల కోసం అమ్మా.. అక్కడ వాళ్లు నా కోసం ఎంత ఏడుస్తున్నారో కదా వాళ్లని తీసుకుని తిరిగి వచ్చాక ఆయన్ని వెతుకుతాను అంటుంది దీప

ఒకే బస్సు ఎక్కిన దీప, సౌర్యలు :

ఇక మరుసటి రోజు ఉదయం దీప హైదరాబాద్ బయలుదేరుతుంది. రోడ్డు మీద నడిచి వెళ్తూ జరిగింది అంతా తలుచుకుంటూ బాధగా ఏడుస్తుంది.పిల్లల కళ్ల ముందే కారు కాలిపోయింది. మేము ఇద్దరం ఇక లేము అనుకుని పాపం. ఎంత బాధపడ్డారో..అత్తయ్యా మావయ్యలు వచ్చి పిల్లల్ని తీసుకుని వెళ్లేంత వరకూ పక్కనే ఉండి ఓదార్చే దిక్కు కూడా ఉండి ఉండదు అని ఏడుస్తుంది. తొందరగా వాళ్ల దగ్గరకు వెళ్లి అందరం కలిసి డాక్టర్ బాబుని వెతకాలి’ అనుకుంటుంది.ఇక సౌర్య, చంద్రమ్మ, ఇంద్రుడు కూడా హైదరాబాద్ బస్ కోసం నడుస్తూ ఉంటారు.సౌర్య మాత్రం కోపంగానే ఉంటుంది. ఇద్దరు కూడా సౌర్యకు నచ్చజెబుతారు. ‘చూడు బంగారు.. నీ కోసం మేము వస్తూ ఉంటాం.. అవసరం అయితే హైదరాబాద్‌ లోనే ఉండి ఏదో పని చేసుకుంటాం అంటారు.

తల్లి కూతుళ్లు ఒకరినొకరు చూసుకుంటారా..?

ఇక దీప హైదరాబాద్ వెళ్లే బస్సును ఆపి హైదరాబాద్ వెళ్లాలి ఎంత టైమ్ అవుతుంది అంటుంది కండెక్టర్‌ని. ‘రాత్రికల్లా చేరుకుంటారమ్మా’ అంటాడు అతడు. దాంతో ఎక్కి బస్సు మధ్యలో ఎడమవైపు కూర్చుంటుంది. మార్గ మద్యమంలో కార్తీక్ గుర్తొచ్చిఈ డాక్టర్ బాబే నీకు డైవర్ బాబా?అంటూ కార్తీక్ నవ్వుతూ వేసిన సెటైర్స్ గుర్తొచ్చి ఏడుస్తుంది దీప.కాస్త దూరం వెళ్లేసరికి ఆ బస్ ను ఆపి సౌర్య, చంద్రమ్మ, ఇంద్రుడు కూడా ఎక్కుతారు.దీప ఆలోచనలో ఉండగానే సౌర్య వాళ్లు బస్ ఎక్కి కూర్చుంటారు. అయితే దీప, సౌర్య ఒకరినొకరు చూసుకోరు.

ఇల్లు కాళీచేస్తున్న సౌందర్య కుటుంబం :

సీన్ కట్ చేస్తే సౌందర్య ఇల్లంతా ఖాళీ చేసే సనిలో పడుతుంది. చిన్న హిమ మాత్రం సౌర్య ఫోటొనే పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. ఆనందరావు దిగులుగా సౌందర్య సద్దుతుంటే చూస్తూ ఉంటాడు. అప్పుడే సౌందర్య.. గోడకి ఉన్న దీప,కార్తీక్‌ల ఫొటో చూసి ఎందుకు మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయారు అంటూ అల్లాడిపోవడంతో ఈరోజు ఎపిసోడ్ పూర్తి అవుతుంది. దీప, సౌర్య ఇంటికి వచ్చే సమయానికి సౌందర్య వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోతారా అనేది తరువాయి భాగంలో చూద్దాం!


Share

Related posts

Devatha Serial: పడిపోయిన దేవత సీరియల్ టిఆర్పి రేటింగ్.. కారణం ఇదేనా.!?

bharani jella

సౌర్య, హిమలు చేసిన పనికి ఇంట్లో నుంచి వృద్ధాశ్రమంకు వెళ్లిపోతున్న సౌందర్య, ఆనందరావులు..!

Ram

Intinti Gruhalakshmi: లాస్యను తోసేసిన తులసి..! అభి చెంప పగలగొడతాను అన్న అంకిత..   

bharani jella