‘ఎఎ’ ఎవరో తెలుసా?

Share

పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ పేరు పార్లమెంటులో ఉచ్ఛరించవచ్చా లేదా? రూల్స్ ఒప్పుకోవంటారు మంత్రులు. స్పీకర్ సుమిత్రా మహాజన్ కూడా అదే మాట అంటారు. మరి రఫేల్ స్కామ్‌ గురించి మాట్లాడుతూ అంబానీ పేరు ప్రస్తావించక పోవడం ఎలా సాధ్యం? ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ సమస్యను ఎలా పరిష్కరించారు?

రఫేల్ స్కామ్‌పై బుధవారం లోక్‌సభలో చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ నవరసాలు పోషించారు. అనిల్ అంబానీ పేరు పలకకూడదా? (అశ్చర్యం). నిజంగా పలకగూడదా? (మరింత ఆశ్యర్యం). మరి ‘ఎఎ’ అని పొడి అక్షరాలతో పిలవవచ్చా? (కొద్ది అమాయకత్వం). (స్పీకర్‌ను ఉద్దేశించి) ఏం మేడమ్‌ ఎఎ అంటే ఓకే కదా? (వినయం). అంబానీ ఏమన్నా బిజెపి సభ్యుడా? (కొంటెతనం). ఇది జరుగుతున్నంత సేపూ తమ నాయకుడి చాతుర్యం చూసి కాంగ్రెస్ సభ్యులు మహా ఆనందపడ్డారు.

రఫేల్ ఒప్పందంలో భాగంగా ఆఫ్‌సెట్ భాగస్వామిగా అనిల్ అంబానీ కంపెనీని నియమించడం పెద్ద కుంభకోణమని రాహుల్ ఆరోపిస్తున్నారు. అంబానీ కంపెనీని స్థానిక పార్టనర్‌గా ఎంపిక చేయాలంటూ రఫేల్ విమానాల కంపెనీ దస్సాల్ట్‌పై గట్టి వత్తిడి వచ్చిందని, ఒప్పందం కుదిరిన సమయంలో ప్రాన్స్ అధ్యక్షుడిగా ఉన్న ఫ్రాన్స్‌వా హోలాండ్ కూడా అన్నారు. తర్వాత ఆయన మాట మార్చారు. ఒప్పందం ప్రకారం మొత్తం డబ్బులో 30 శాతం దస్సాల్ట్ ఇండియాలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ కుంభకోణం మోదీ నిర్ణయం ప్రకారం జరిగిందనీ, దీని వల్ల 30 వేల కోట్ల రూపాయల ప్రజాధనం లూటీ అవుతోందనీ రాహుల్ అంటున్నారు.

రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందంలో స్కాం జరిగిందనడానికి గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ చేసిన ప్రకటనే తార్కాణమంటూ రాహుల్ ఈ రోజు లోక్‌సభలో ఆయన మాట్లాడిన మాటల ఆడియో వినిపించేందుకు ప్రయత్నించారు. అందుకు ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ నాయకత్వంలో అధికారపక్షం సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ మాటలు వినిపించలేక పోయినా సభలో రాహుల్ గాంధీ పైచేయి సాధించినట్లే అనుకోవాలి.

రాహుల్ దాడిని ఎదుర్కొనేందుకు అరుణ్ జైట్లీ సుప్రీంకోర్టు తీర్పును అడ్డం పెట్టుకున్నారు. సుప్రీంకోర్టుకు సంతృప్తి కలిగినా రాహుల్‌కు కలగడం లేని ఆయన అన్నారు. రాహుల్ గాంధీకి సత్యం పట్ల సహజసిద్ధమైన అయిష్టత అని జైట్లీ వ్యాఖ్యానించారు. రాహుల్ పొడి అక్షరాలను ప్రస్తావిస్తున్నారు కాబట్టి తాను కూడా అదే పని చేస్తానంటూ, రాహుల్ గాంధీ ‘క్యు’ మాటలు మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు. జైట్లీ ‘క్యు’ అన్నది ఇంటాలియన్ వ్యాపారి ఒట్టావియో కట్రోచీని ఉద్దేశించి. కట్రోచీ బోఫోర్స్ కుభకోణంలోనిందితుడు. ఆయన 2013లో మరణించారు.


Share

Related posts

బిజెపి జాతీయ అధ్యక్షుడుగా నడ్డా

somaraju sharma

అగస్టా కుంభకోణం పాత్రలో కాంగ్రెస్ : కన్నా

Siva Prasad

‘పోటీ పడాలంటే నాకే సిగ్గుగా ఉంది’

sarath

Leave a Comment