భారత్ ‘చారిత్రాత్మక’ విజయం


సిడ్ని(ఆస్ర్టేలియా), జనవరి 7: ఆస్ర్టేలియా గడ్డపై భారత్ చారిత్రాత్మక విజయాన్ని సాధించింది . బోర్డర్-గవాస్కర్ టెస్టు సీరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఆసీస్‌పై 71 ఏళ్ళలో తొలి టెస్టు సీరీస్‌ను గెలుపొందడం విశేషం. సిడ్నిలో జరుగుతున్న చివరిదైన నాల్గవ టెస్టు వర్షం కారణంగా సోమవారం నాడు జరగాల్సిన ఆఖరిరోజు ఆటను అంపైర్లు రద్దు చేశారు. దీంతో చివరి టెస్టు డ్రాగా ముగియడంతో భారత్ 2-1 తేడాతో ట్రోఫీ సాధించింది.
గతంలో 1980-81,1985-86,2003-04 పర్యటనల్లో భారత్ సీరీస్‌లను డ్రా ముగించింది. అస్ర్టేలియాపై ఆడిన 47 టెస్టుల్లో టీం ఇండియాకు ఏడు విజయాలు దక్కాయి. చివరి టెస్టులో భారత జట్టు ఏడు వికెట్లు నష్టానికి 662పరుగులు చేసి డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్ లో ఆతిధ్య జట్ల 300 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఫాలోఆన్ అడుతున్న ఆసీస్‌ను వర్షం ఓటమి నుంచి తప్పించి డ్రాగా ముగిసేటట్లు చేసింది.

భారత జట్టుకు రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ అభినందనలు తెలిపారు. జట్టు సమిష్టి కృషితో విజయం సాధించి చరిత్ర సాధించారని కొనియాడారు.  ఇదే స్పూర్తిని కొనసాగించాలని అకాంక్షించారు.