ల‌తా మంగేష్క‌ర్‌కి అస్వ‌స్థ‌త‌


ప్ర‌ముఖ బాలీవుడ్ గాయ‌ని ల‌తా మంగేష్క‌ర్‌ అస్వ‌స్థ‌త గుర‌య్యారు. దీంతో ఆమెను ముంబైలోని బీచ్ క్యాండీ హాస్పిట‌ల్‌కు చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. సెప్టెంబ‌ర్ 28న ల‌తా మంగేష్క‌ర్ త‌న 90వ పుట్టిన‌రోజును జ‌రుపుకున్నారు. గుండెల్లో ఇన్‌ఫెక్ష‌న్ రావ‌డంతో శ్వాస సంబంధ‌మైన స‌మ‌స్య వ‌చ్చింది. దీంతో సోమ‌వారం ఉద‌యం రెండు గంట‌ల ప్రాంతంలో హాస్పిట‌ల్‌కు ల‌తా మంగేష్క‌ర్‌ను తీసుకెళ్లారు. అప్ప‌టికి ఆమె ప‌రిస్థితి కాస్త విష‌మంగా ఉంద‌ని వెంట‌నే డాక్ట‌ర్స్ ఆమెకు చికిత్స అందించ‌డంతో కాస్త కోలుకున్నారు.ఆమెను ఇంటికి పంపామ‌ని ఆసుప‌త్రి వ‌ర్గాలు తెలిపాయి.

today news