NewsOrbit
టాప్ స్టోరీస్

ఏపీ అనేది ఒకటుందని గుర్తించు నత్వాని…!

ముకేశ్ అంబానీ.., ఆయన నీడ నత్వాని ఇద్దరూ ఈ మధ్య ఏపీకి బాగా దగ్గరైన పేర్లు…! అప్పుడెప్పుడో 40 రోజుల కిందట సీఎం జగన్ ని కలిశారు, కష్ట సుఖాలు మాట్లాడారు, రాజ్యసభ టికెట్ అడిగారు, జగన్ కరుణించారు, సీటు ఖరారు చేసారు. తన పార్టీ వారిని కాదని, నమ్మిన వారిని సొంత బాబాయిని కాదనుకుని నత్వానికి సీటు ఇచ్చేసారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. మరి అంబానీతో సఖ్యత కుదిరింది కదా, రిలయన్స్ తో కయ్యం ఎందుకు అనుకుని… రిలయన్స్ పై దాడుల కేసులను ఎత్తేసారు. అలా అలా ముకేసుడితోనూ, ఆయన నీడ నత్వానితోనూ జగనుకి, ఏపీకి సాన్నిహిత్యం బాగానే ఏర్పడింది.

కరుణ చూపవయా…!

మరి ఇప్పుడెందుకు వీళ్లిద్దరి విషయం అనుకుంటున్నారేమో… అదే చూద్దాం…! ఏపీకి ఇప్పుడు తక్షణం ఏమవసరం అంటే చిన్న పిల్లగాడు కూడా చెప్పేది డబ్బు అని. జగన్ నుండి రాష్ట్ర పెద్దల వరకు అందరూ పదేపదే సాయం కోసం అభ్యర్థిస్తున్నారు. రాష్ట్రం కష్టాల్లో ఉంది ఆదుకోవాలంటూ ప్రకటనలిస్తున్నారు. దాతలూ కొంత వరకు స్పందిస్తున్నారు. తోచిన సాయం చేస్తున్నారు. మరి ఆ అంబానీ ఏమైపోయినట్టు? ఆయన నీడ నత్వాని ఏమైపోయినట్టు…? అంబానీ లక్షల కోట్ల ఆస్తి పరుడు. నత్వాని కూడా వేల కోట్ల ఆస్తి పరుడు. మరి ఇప్పుడేంటి ఇటు చూడట్లేదు. రాజ్యసభలో సీటు కోసం అవసరమైన రాష్ట్రం, అవసరార్ధం లో ఉంటె కనిపించలేదా? వేల కోట్లలో కనీసం యాభయ్యో, వందో … అదీ లేదంటే ఒక పాతికైనా ఇటు వేసేస్తే రాష్ట్రానికి చేదోడుగా ఉంటుంది, జగన్ కి తన నిర్ణయంపై నమ్మకం ఏర్పడుతుంది, జనాలకు కూడా నత్వానిపై ఒక అభిప్రాయం ఏర్పడుతుంది కదా…? మరి ఏమైనట్టు? ఆ అంబానీ ఎక్కడ? ఆ నత్వాని ఎక్కడ?

సీటు కోసమే రాష్ట్రం…!

ఏపీలో ఇది కొత్త కాదు. ఎప్పుడూ ఇంతే. హోదా, పదవి కోసం పరాయి రాష్ట్రాల వారు ఇక్కడకు రావడం అనుకున్నది తీసుకోడవం తర్వాత మొహం చాటేయడం జరుగుతూనే ఉంది. గతంలో ఏపీ కోటాలో నిర్మలా సీతారామన్ రాజ్యసభకు వెళ్లారు. రాష్ట్రానికి చేసిందేం లేదు. ఆమె తర్వాత సురేష్ ప్రభు రాజ్యసభకు వెళ్లారు. ఆయన మన రాష్ట్రం తరపున రాజ్యసభ సీటు తీసుకుని రైల్వే మంత్రిగానూ పని చేసారు. కానీ ఆయన రాష్ట్రానికి విదిల్చినది ఏమి లేదు. అవకాశం ఉన్నా, చేతిలో పదవి ఉన్నా రాష్ట్రానికి ఇచ్చిన ప్రత్యేక సాయం ఏమి లేదు. నాడు చంద్రబాబు చేసిన తప్పు నేడు జగన్ చేసారు. నాడు సురేష్ ప్రభు చేసిన నేరం , నేడు నత్వాని చేస్తున్నారు. నిజానికి సురేష్ ప్రభు కంటే నత్వాని చేయగలిగిన సాయమే, అయినా ఎందుకో ఉలుకు పలుకు లేదు. నత్వాని ఈ సమయంలో స్పందించకునే ఆయన కంటే ఈ ప్రభావం జగన్ పై ఎక్కువగా పడుతుంది.

Related posts

Ayodhya : జ‌న‌వ‌రి 22 : అయోధ్య రామ‌మందిరం ఓపెనింగ్‌.. మీ గ్రామాల్లో ఈ ప‌నులు చేయండి..!

Saranya Koduri

Subrata Roy: సుబ్రతా రాయ్ ఇక లేరు…సహారా గ్రూప్ స్థాపకుడుకి 75 సంవత్సరాలు, దీర్ఘకాలిక అనారోగ్యం తో కన్ను మూత.

Deepak Rajula

International Girl Child Day: అంతర్జాతీయ బాలికా దినోత్సవంపై స్పెషల్ స్టోరీ.. 2023 థీమ్ ఏంటి? దీని చరిత్ర..

siddhu

Amaravati Capital Case: అమరావతి రాజధాని కేసు డిసెంబర్ కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు .. ఏపీ సర్కార్ కు షాక్ | Supreme Court Shocks AP Govt in Amaravti Case 

sharma somaraju

Kuno National Park: కునో నేషనల్ పార్కుకు మరో 12 చిరుతలు.. ఈ పార్కుకు వెళ్లాలని అనుకుంటున్నారా? హైదరాబాద్, విజయవాడ నుంచి ఇలా వెళ్లండి!

Raamanjaneya

Mughal Gardens: అమృత ఉద్యాన్‌గా మొఘల్ గార్డెన్.. దీని చరిత్ర.. ప్రత్యేకతలు!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

KCR’s BRS: నూతన శాతవాహన సామ్రాజ్యం దిశగా పావులు కదుపుతున్న నయా శాతవాహనుడు సీఎం కేసీఆర్

sharma somaraju

ఆ ఇద్దరూ ఒకే వేదికపై ..! బీజేపీ భారీ ప్లాన్స్, సక్సెస్ అవుతాయా..!?

Special Bureau

Why Lawrence Bishnoi wants Salman Khan Dead? నాలుగు సంవత్సరాల నుండి సల్మాన్ నీ చంపడానికి ప్లాన్ చేస్తున్న దుండగులు..!!

Siva Prasad

PK Team: పీకే టీమ్ – 1500మంది రెడీ ..! వైసీపీ కోసం భారీ ప్లాన్స్..!

Special Bureau

YSRCP: ఈ విషయాలు గమనిస్తే దటీజ్ జగన్ అనాల్సిందే(గా)..?

sharma somaraju

Rahul Gandhi: వరంగల్ సభలో టీఆర్ఎస్ పై రాహుల్ సీరియస్ కామెంట్లు..!!

sekhar

Telangana Crime: భాగ్యనగరంలో అమానవీయ ఘటన! పదహారు మంది బాలల బట్టలూడదీసి కొట్టినా కిమ్మనని పోలీసులు,కెసిఆర్ సర్కారు!

Yandamuri

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment