టాప్ స్టోరీస్

అతడు పాకిస్థానీ కాదు!

Share

న్యూఢిల్లీ: ‘భారతదేశపు ప్రధాన విభజనకారుడు’ అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీని నిశితంగా విమర్శిస్తూ టైమ్ పత్రిక కవర్ స్టోరీ రాసిన రచయిత ఆతిష్ తసీర్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అతడి పేరును బట్టి అతడు పాకిస్థానీ అని, అందుకే విషం చిమ్ముతున్నాడని అన్నారు. పలువురు బీజేపీ నేతలు కూడా దీన్ని విమర్శించారు. స్వయంగా పార్టీ అధ్యక్షుడు కూడా ఈ తరహా అనుమానాలు వ్యక్తం చేశారు. ‘‘ఈ దేశ ప్రజల సిక్స్త్ సెన్స్ ఏ పత్రిక కన్నా చాలా పెద్దదని నేను నమ్ముతాను. మోదీ పనితీరు ఎలా ఉందో మే 23వ తేదీన నిర్ణయమవుతుంది. నాకు తెలిసిన సమాచారాన్ని బట్టి.. ఆ కథనాన్ని ఒక పాకిస్థానీ రచయిత రాశాడంటున్నారు. అలాంటిదాన్ని సీరియస్ గా తీసుకోవక్కర్లేదు’’ అని చెప్పారు.

బీజేపీ అధికార ప్రతినిధి డాక్టర్ సంబిత్ పాత్రా కూడా విలేకరుల సమావేశంలో ఇదే అన్నారు.‘మోదీని భారతదేశపు విభజనకారుడు అన్న వ్యక్తి పాకిస్థాన్ కు చెందినవాడు. పాకిస్థాన్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. వాళ్లమీద రెండుసార్లు సర్జికల్ దాడులు జరిగాయి కాబట్టి మోదీ అంటే వాళ్లకు ద్వేషం. ఇక చెప్పడానికి ఏముంది? కానీ రాహుల్ గాంధీ మాత్రం దాని గురించి ట్వీట్ చేస్తారు’ అని చెప్పారు.

జీ న్యూస్ తో మాట్లాడిన బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సయ్యద్ షానవాజ్ హుస్సేన్ కూడా ఇదే మాట చెప్పారు. ‘‘ఆ కథనం రాసిన వ్యక్తి పాకిస్థానీ. అతడు అమెరికా వెళ్లినా, అతడి మనసులో మాత్రం మోదీ మీద కోపం అలాగే ఉంటుంది. టైమ్ పత్రిక నుంచి మాకు ఎలాంటి సర్టిఫికెట్ అవసరం లేదు. భారతదేశ చరిత్రలో ప్రధాని మోదీ హయాంలోనే అత్యంత తక్కువగా మతఘర్షణలు జరిగాయి’ అని ఆయన అన్నారు.

వాస్తవం ఇదీ..
అయితే, భారతీయ జర్నలిస్టు తవ్లీన్ సింగ్ కుమారుడు, పాకిస్థానీ రాజకీయ నాయకుడు సల్మాన్ తసీర్ కొడుకైన ఆతిష్ తసీర్ జాతీయత గురించి బీజేపీ చెబుతున్నది వాస్తవం కాదు. తసీర్ బ్రిటిష్ పౌరుడు. అతడు యూకేలో పుట్టి, భారతదేశంలో పెరిగి, ఇప్పుడు అమెరికాలో నివసిస్తున్నాడు. దీనిపై అతడు తిరంగా టీవీతో మాట్లాడాడు. ‘‘విమర్శల విషయానికొస్తే నేను బాగా దాక్కుంటాను. ప్రజలు ఎలా కావాలంటే అలా మాట్లాడుకోవచ్చు. కానీ, బీజేపీ అధికార ప్రతినిధులు కూడా నేను పాకిస్థానీ అని అబద్ధాలు చెబుతున్నారు. నేను భారతదేశంలో పెరిగానని వాళ్లకు తెలుసు. పాకిస్థాన్ కు మీరెన్నిసార్లు వెళ్లారో నేనూ అన్నిసార్లే వెళ్లాను. అదే నన్న బాధిస్తుంది’’ అని చెప్పాడు.

https://www.facebook.com/AuthorAatishTaseer/posts/1777961355784465

సీనియర్ పాత్రికేయురాలు తవ్లీన్ సింగ్ కూడా తన కొడుకు పాకిస్థానీ అన్న ఆరోపణలను ఖండించారు. కబీర్ బేడీ చేసిన ట్వీట్ కు ఆమె సమాధానం ఇచ్చారు. ‘‘కబీర్ తాను రాసినదాంతోనే విభేదిస్తాడు. అతడు పాకిస్థానీ కాదని నీకు తెలుసు’’ అన్నారు.

(ఆల్ట్ న్యూస్ సౌజన్యంతో)


Share

Related posts

గోదారి వరదలపై సిఎం ఆరా

somaraju sharma

వైట్ హౌస్ సమీపంలో కాల్పుల కలకలం!

Mahesh

‘ఉల్లి’పాయకు ఓ పథకం పెట్టాలట!

Mahesh

Leave a Comment