(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అగ్రరాజ్యం అమెరికాలో కాల్పులు మళ్లీ కలకలం సృష్టించాయి. వాషింగ్టన్లోని అమెరికా అధ్యక్షుడి అధికార నివాసం వైట్ హౌస్ కు సమీపంలో ఉన్న వీధుల్లో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వైట్ హౌస్ కు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొలంబియా హైట్స్ ప్రాంతం సమీపంలో నిన్న రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. నిందితుడి కోసం సీసీటీవి ఫుటేజీని పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. క్షతగాత్రుల్లో చిన్నారులెవరూ లేరని చెప్పారు.