NewsOrbit
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

పార్టీకి అధ్యక్షుడు కావలెను..! పాపం.., జాతీయ పార్టీ పరిస్థితి ఇలా…!

 

130 ఏళ్ల చరిత్ర. వందేళ్లకు పైగా అధికారం. వేలకొద్దీ నేతలు. వందల సంఖ్యలో జాతీయ స్థాయిలో పేరొందిన నాయకులు. కోట్ల మంది కార్యకర్తలు. రాజకీయం అంటే ఆ పార్టీదే. ఇవన్నీ ఆ జాతీయ పార్టీకి చారిత్రక అంశాలు గానే మిగిలిపోతున్నాయి. చరిత్రలో ఒక పేజీగా మాత్రమే చెప్పుకోవలసి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ భారత దేశంలో ఒక భాగం. దేశంలో ఆ పార్టీ లేకుండా రాజకీయాన్ని ఊహించుకోలేము. అటువంటి పార్టీకి ఇప్పుడు అధినేత కరువయ్యారు. పార్టీ నావను నడిపించే నావికుకుడు లేక నాయకులందరూ నీటిలో కొట్టుమిట్టాడుతున్న పార్టీలోనే కొట్టుమిట్టాడుతున్నారు. ఎవరికీ వారు అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవడంతో సోనియాపై భారం మళ్ళీ తప్పేలా లేదు.

Sadly situation of the National congress Party

 

రాహుల్ గాంధీ పరిస్థితి ఇంకెన్నాళ్లు ఇలా?

అమేథీ నియోజకవర్గం నుండి 2004 నుండి 2019 వరకు లోక్ సభ సభ్యుడు ప్రాతినిధ్యం వహించిన రాహుల్ గాంధీ 2019 ఎన్నికల్లో వాయనాడ్ లోక్ సభ సభ్యుడుగా ఎన్నికయ్యారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 206 ఎంపీ సీట్లు గెలుచుకోగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రచార భాద్యతల సారధ్యం వహించిన 2014 ఎన్నికల్లో కేవలం 44సీట్లు మాత్రమే గెలిచి పార్టీ చరిత్రలో ఘోర వైఫల్యాన్ని చవి చూసింది. 2019 ఎన్నికల్లోనూ 52 సీట్లు మాత్రమే గెలుచుకున్నది కాంగ్రెస్. పార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత, మనస్తాపంతో రాహుల్ గాంధీ పార్టీ జాతీయ అధ్యక్ష బాధ్యతల నుండి తప్పుకున్నారు. రాహుల్ గాంధీ తో పాటు పలు రాష్ట్రాల్లోని పీసీసీ అధ్యక్షులు కూడా రాజీనామాలు చేశారు. పార్లమెంట్ లో సీరియస్ డిస్కషన్స్ సమయంలో రెండు మూడు పర్యాయాలు రాహుల్ గాంధీ కన్ను కొట్టడం, ప్రధాని మోడీ వద్దకు వెళ్లి ఆలింగనం చేసుకోవడం వంటి చిలిపి చేష్టలు అయన వ్యక్తిత్వంపై ప్రభావం చూపాయి.

అంతర్గత ఎన్నిక తప్పదా?

పార్టీ సారధ్య బాధ్యతల నుండి రాహుల్ తప్పుకోవడం, పార్టీ ముఖ్య నేతలు అయనపై తీవ్ర వత్తిడి చేసినా ససేమిరా అనడంతో సోనియా గాంధీనే తాత్కాలికంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వయో భారం, ఆరోగ్య సమస్యల నేపథ్యంలో సోనియా గాంధీ పార్టీ బాధ్యతల నుండి తప్పుకోవాలని అనుకుంటున్నారుట. ప్రతి ఏటా కాంగ్రెస్ ప్లినరీ నిర్వహించాల్సి ఉండగా రెండేళ్ల నుండి నిర్వహించడం లేదు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ప్లినరీ నిర్వహించాలని భావించినా కరోనా కారణంగా ప్లినరి నిర్వహణ, కొత్త అధ్యక్షుడి ఎంపిక వాయిదా పడింది. గాంధీ కుటుంబం నుండి అధ్యక్ష బాధ్యతల నిర్వహణకు ఎవరు ముందుకు రాకపోతే పార్టీలో అంతర్గత ఎన్నికలు నిర్వహించాలని పార్టీలో ఒక వర్గం నుండి డిమాండ్ వస్తున్నది.

 

Related posts

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju