బిగ్ బాస్ సీజన్ 4 మొదటి వారం చప్పగా సాగినా… కనీసం ఒక రకమైన టిఆర్పి రేటింగ్ వచ్చింది అంటే దానికి కారణం గంగవ్వ. మొట్టమొదటిసారి తెలుగు సీజన్లో వృద్ధ వయస్కురాలిని కంటెస్టెంట్స్ లిస్ట్ లో చేసిన నిర్వాహకులు ఒక రకంగా ఆమె ఎంట్రీ తో మంచి సక్సెస్ సాధించారు. అయితే గంగవ్వ మాత్రం ప్రస్తుతం డీలా పడిపోయింది. నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, నన్ను పంపించేయండి…. నావల్ల కావడం లేదు అంటూ గంగవ్వ బిగ్ బాస్ ను అడిగింది.
నిజానికి బిగ్ బాస్ హౌస్ లో చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్. తన వయస్సు సహకరించకపోయినప్పటికీ హౌస్ విషయాల్లో తన వంతు సహకారం అందిస్తుంది. గేముల్లో కూడా పర్ఫామెన్స్ పర్లేదు. అయితే గంగవ్వ గురించి మొదటి వారంలో బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన సూర్య కిరణ్ సంచాలన్ కామెంట్స్ చేశాడు. గంగవ్వ ఆరోగ్యానికి ఏమీ కాలేదని…. ఆమె చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పాడు. కానీ ఆమెని వయస్సు విషయంలో వీక్ గా ఉంది అని చూపించి…. తనకంటూ గుర్తింపు లేకుండా చేస్తున్నారని ఆయన అన్నారు.
నిజానికి అది ప్రేమ కాదు కాదు అంతా నాటకం అని ఆమెను త్వరగా హౌస్ నుండి పంపించడం కోసం కంటెస్టెంట్స్ అంతా కలిసి ఒక డ్రామా ఆడుతున్నారని ఇంటర్వ్యూలో సూర్యకిరణ్ బాంబు పేల్చాడు. అందుకే పడవ టాస్క్ లో కూడా ఎక్కువసేపు కూర్చొనివ్వకుండా నువ్వు నామినేట్ అయినా నీకు ఓట్లు వేసి గెలిపిస్తారు అంటూ మాట్లాడారు. ఓపిక ఉన్నంత సేపు అవ్వ ఉంటుంది…. కానీ ఆమెను ముందే పోవాలంటూ అడగడం ఎందుకు? అని ప్రశ్నించాడు.
మళ్లీ నాటకాలు ఆడుతూ నీ ఇష్టం…. ఉంటే ఉండు! లేకపోతే లేదు అనడంలో అర్థం ఏముంది అని అడిగాడు కిరణ్. గంగవ్వ త్వరగా ఇంట్లో నుంచి బయటికి పంపించే కుట్ర జరుగుతోందని… ఆమె ఆరోగ్యంగా చాలా యాక్టివ్ గా ఉంది అని…. వారే కావాలని ఆమెను మార్చేస్తున్నారని సూర్య కిరణ్ ఆరోపించాడు. ఇక కచ్చితంగా ఫైనల్స్ చేరే సత్తా గంగవ్వ కి ఉంది అని సూర్య కిరణ్ నమ్మకం వ్యక్తం చేశారు.