కిమ్ జాంగ్ ఉన్.. ఈ పేరు వినగానే ఉత్తర కొరియా మొత్తం ఉలిక్కి పడుతుంది. స్వేచ్ఛ అనే పదం ఆ దేశ ప్రజలకు తెలియకుండా ఒక నియంతలా ఆ దేశాన్ని పాలిస్తున్నాడు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యంపై పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో తన జీవితంలో ఎలాంటి సుఖాలు అనుభవించాడో.. అనుభవిస్తున్నాడో ఇక్కడ తెలుసుకుందాం..
ప్రైవేట్ జెట్ లు, దిగుమతి చేసిన డిజైనర్ సిగరెట్లు… ఇది ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ విలాసవంతమైన జీవితం. స్థానిక ఆల్కహాల్ చౌకగా ఇంకా సులభంగా అందుబాటులో ఉన్నప్పటికీ, అమెరికన్ స్పిరిట్, జర్మన్ వైన్ కోసం నెలకు దాదాపు కోటి దాకా ఖర్చు చేస్తున్నారట!
కిమ్ ఆహారం విషయానికి వస్తే అతను డెన్మార్క్ నుండి పంది మాంసం, ఇరాన్ నుండి పంపిణీ చేసిన కేవియర్ కేజీ 23 లక్షలు పలికే ఆహారం తీసుకుంటారు. అంతేకాకుండా బ్రెజిల్ కాఫీ మాత్రమే తాగుతారు అందుకుగాను ఒక సంవత్సరానికి అయ్యే ఖర్చు 6 కోట్ల రూపాయిలట.
అందరూ డ్రెస్సులు, నగలు డిజైన్ చేయించుకుంటే, కిమ్ అందుకు భిన్నంగా సిగరెట్లను డిజైన్ చేయించుకుంటారు. ఒక ప్యాకెట్ సిగరెట్ ధర 3000 అయితే దానికి డిజైన్ చేయడానికి అయ్యే ఖర్చు 12000. కిమ్ జోంగ్ ఉన్ 200 అడుగుల ఎత్తయిన పడవకు యజమాని దీని విలువ దాదాపు 8 మిలియన్లు.
ఇన్ని ఆహారపు అలవాట్లు ఉన్న కిమ్ జోంగ్ ఉన్ కు అనారోగ్య సమస్యలు అధికంగా ఉండడంతో అతని వెంట 130 మంది వైద్యులు ఉంటారు. అంతే కాకుండా కిమ్ ఎక్కడ నివసిస్తున్నారు? అనే ప్రశ్నకు కచ్చితమైన సమాధానం లేదు. ఎందుకంటే అతను ఎంచుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా 17 విలాసవంతమైన రాజభవనాలు ఉన్నాయి.