ట్రెండింగ్

Salman Khan: విడాకులు తీసుకున్న సల్మాన్ ఖాన్ తమ్ముడు..??

Share

Salman Khan: సినిమా ఇండస్ట్రీలో రోజు రోజుకు విడాకులు తీసుకునే జంటలు ఎక్కువైపోతున్నాయి. గత ఏడాది బాలీవుడ్ ఇండస్ట్రీలో అమీర్ ఖాన్- కిరణ్ రావు, టాలీవుడ్ ఇండస్ట్రీలో నాగచైతన్య సమంత విడాకులు తీసుకోవడం తెలిసిందే. ఇక ఈ ఏడాదిలో ధనుష్- ఐశ్వర్య జంటలు విడాకులు తీసుకోగా…ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో మరో జంట విడాకులు తీసుకోవడం సంచలనంగా మారింది.

Salman Khan's younger brother who is divorced

ఆ జంట మరెవరో కాదు సల్మాన్ ఖాన్ చిన్న తమ్ముడు సోహైల్ ఖాన్.. సీమా ఖాన్ లు విడాకులు తీసుకున్నట్లు బీ టౌన్ లో వార్తలు వస్తున్నాయి. ముంబైలోనీ స్పెషల్ కోర్టు వీరిద్దరికీ విడాకులు మంజూరు చేసినట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. సొహైల్ ఖాన్… సీమా ఖాన్ 1998లో ఇంట్లో నుండి పారిపోయి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మరి కారణాలు ఏమిటో తెలియదు గానీ 24ఏళ్ల బంధానికి తాజాగా వీరిద్దరూ గుడ్ బై చెప్పినట్లు న్యూస్ వైరల్ అవుతుంది.

దీంతో ఈ వార్తపై చాలామంది సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ కి పెళ్లి కలిసి రాలేదని కామెంట్లు చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ ఫ్యామిలీలో సల్మాన్ కి ఇప్పటి వరకు పెళ్లి కాలేదు. సల్మాన్ పెద్ద తమ్ముడు అర్బజ్ … భార్య మలైకాకి.. గతంలోనే విడాకులు ఇవ్వటం.. ఆమె.. తన కంటే చిన్నవాడైన హీరో అర్జున్ కపూర్ తో ప్రస్తుతం రిలేషన్ లో ఉండటం తెలిసిందే.కాగా ఇప్పుడు చిన్న తమ్ముడు సోహైల్ ఖాన్ విడాకులు తీసుకోవటం… బాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.


Share

Related posts

రెడ్ సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ అయిన రామ్ ..?

GRK

Khargone communal clashes: ఖర్గొన్ లో శ్రీరామనవమి అల్లర్లలో పారిశుద్ధ్య కార్మికుని హత్య చేసిన ఐదుగురు అరెస్ట్..!!

sekhar

Rajamouli – Mahesh babu : ఆఫ్రికా అడవుల్లో అతిపెద్ద యాక్షన్ డ్రామా రాజమౌళి _ మహేష్ బాబు సినిమా..

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar