ట్రెండింగ్ సినిమా

SVP: స్పెషల్ షో వేయించుకుని మరి “సర్కారు వారి పాట” చూసిన బాలయ్య..??

Share

SVP: నటసింహం నందమూరి బాలకృష్ణ తన సినిమాలు తప్ప మిగతా సినిమాల గురించి పెద్దగా పట్టించుకోరు. అటువంటి బాలకృష్ణ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటించిన “సర్కారు వారి పాట” సినిమా చూసినట్టు ఇండస్ట్రీలో లేటెస్ట్ వార్త వైరల్ అవుతుంది. ప్రత్యేకంగా మహేష్ మీద అభిమానంతో… మహేష్ బాబు సొంత థియేటర్ AMB లోనే తనకి స్పెషల్ స్క్రీనింగ్ వేయించుకున్నట్లు తాజా సమాచారం. సినిమా చూస్తున్నంత సేపు బాలయ్య ఫుల్ ఎంజాయ్ చేసినట్లు… అనంతరం సినిమా యూనిట్ నీ ప్రత్యేకంగా అభినందించినట్లు వార్తలు వస్తున్నాయి.

Balayya watched the special show and watched Sarkaru Vari Pata

విషయంలోకి వెళితే “సర్కారు వారి పాట” నిర్మించిన వారిలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ కూడా ఒకటి. ఇప్పుడు ఇదే బ్యానర్ కింద గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో బాలయ్య కోసం మహేష్ బాబు థియేటర్ లోనే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు సర్కారు వారి పాట స్పెషల్ షో వేసి చూపించడం జరిగిందట. లో బాలయ్య… మహేష్ యాక్టింగ్ నీ ఫుల్ ఎంజాయ్ చేయడం జరిగింది అని… పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారని సమాచారం.

ఇదిలా ఉంటే గతంలోనే బాలకృష్ణ ఆహా ఓటిటిలో ఆన్ స్టాపబుల్ షోలో నేను అభిమానించే హీరో అని మహేష్ ని పొగడటం జరిగింది. అయితే ఇప్పుడు ఏకంగా మహేష్ సినిమా…స్పెషల్ షో వేయించుకుని మరి బాలయ్య చూడటం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. “సర్కారు వారి పాట” సినిమా చూసి ఇప్పటికే ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్.. ఇంకా చాలామంది ఇండస్ట్రీకి చెందిన దర్శకులు నటీనటులు పాజిటివ్ కామెంట్ చేశారు. ఇక ఇదే సమయములో బాలయ్య కూడా పాజిటివ్ గా.. సినిమా పాట్ల రియాక్ట్ అయినట్లు వార్తలు రావటం సంచలనంగా మారింది.


Share

Related posts

Anikha Surendran New Gallerys

Gallery Desk

Today Gold Rate: దూసుకెళ్తున్న బంగారం ధరలు.. దిగివస్తున్న వెండి ధరలు..!!

bharani jella

Bheemla Naayak: “బీమ్లా నాయక్” మిస్ చేసుకున్న యంగ్ డైరెక్టర్..??

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar