నేడు సమాజంలో ప్రజలు అధిక బరువు కలిగి ఉండటాన్ని ఏదో లోపంగా భావిస్తున్నారు. దీనితో బరువున్న వారు అనేక రకాల పాట్లు పడి మరీ సైజ్ జీరో కావడానికి తెగ ప్రయత్నాలు చేసేస్తుంటారు. మరొకొందరైతే వ్యాయామాలు, జిమ్ లని, డైటింగ్ లు అని సమయాన్నంతా దానికే కేటాయించేస్తుంటారు. మరి దాని వల్ల ఏమైనా తగ్గొచ్చా అంటే అది కొంత వరకు సాధ్యం అవుతుందనుకోండి. కాని అందరికీ అంత తీరిక ఉండదు కదా..
సైజ్ జీరో సినిమా లాగా కొందరైతే తెగ వ్యాయామాలు, డైట్ చార్టును ఫాలో అవుతూ తెగ తిప్పలు పడిపోతుంటారు. మరి కొందరైతే వేలకు వేలు పోసి మరీ బరువు నియంత్రణ కోసం తెగ పాట్లు పడుతుంటారు. కాని మన ఇంట్లో లభించే వాటితోనే బరువును కోల్పోవచ్చు. కాని అలా చేసేవారు మాత్రం చాలా అరుదనే చెప్పవచ్చు. టీవీల్లో చూపించే యాడ్ లను ఫాలో అవుతుంటారు. ఇక నుంచి మీ ప్రయత్నాలను మీ ఇంట్లో నుంచే మొదలు పెట్టి చూడండి.
ఈ వెయిట్ లాస్ కోసం ఇక నుంచి మీరు మీ కడుపును మాడ్చుకోవాల్సిన అవసరం లేదు. కడుపునిండా తింటూనే మీ బరువును కోల్పోవచ్చు. మనం నిత్యం వండుకునే కూరగాయలతోనే మనం వెయిట్ లాస్ చేసుకోవచ్చండి. వివిధ రంగుల్లో లభించే కూరగాయలకు మనం శరీర బరువును తగ్గించే శక్తి ఉంటుందట. ఉడికించకుండా తినగలిగే కూరగాయలకు శరీరంలో ఉండే అదనపు కొవ్వులను తగ్గించి బరువును తగ్గిస్తాయని వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి. వీటితో పాటు గ్రీన్ టీ లాంటివి కూడా బరువును నియంత్రణలో ఉంచుతుంది.
వీటిలో ముఖ్యంగా తాజా కూరగాయలు, వివిధ రంగుల్లో లభించే బెల్ పెప్పర్, టమోటాల కు అధిక బరువును తగ్గించే గుణాలుంటాయి. వీటితో పాటు బఠానీలు, ద్రాక్ష, పుచ్చకాయలు, కీరా, గుమ్మడికాయలు..ఇలా వివిధ రంగుల్లో మెరిసేవి కూడా బరువును తగ్గించడంలో ఎంతో ఉపయోగపడతాయి. అలాగే మిరపకాయ కూడా బరువును నియంత్రించే గుణాన్ని కలిగి ఉంటుందట. మరింకెందుకు ఆలస్యం మీ రోజూ వారి ఆహారంలో వీటిని చేర్చి మీ బరువును తగ్గించుకోండిలా..