Vitamin K: ఎముకలు గుల్ల బారకుండా ఉండడానికి.. ఈ విటమిన్ అద్భుతంగా పనిచేస్తుంది..!!

Share

Vitamin K: విటమిన్లు అంటే చాలామంది విటమిన్ ఏ, బి, సి , డి, ఇ అని మాత్రమే అనుకుంటారు.. అసలు విటమిన్ కె అనే విటమిన్ ఒకటి ఉంటుందని ఎక్కువ మందికి తెలియదు.. విటమిన్ కె సమృద్ధిగా ఉన్న ఆహార పదార్థాలు మీ డైట్ లో భాగంగా చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు.. అసలు విటమిన్ కె ఏ ఆహార పదార్ధాల్లో లభిస్తుంది.. విటమిన్ కె వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం..!!

Vitamin K: for bone strength
Vitamin K: for bone strength

Vitamin K: విటమిన్ కె తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..!!

విటమిన్ కె మనిషి ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తుందని అనేక అధ్యయనాలలో నిరూపితమైంది. ఇది రక్తం గడ్డ కట్టడంలో సహాయపడుతుంది. విటమిన్ కె ఆకుకూరల్లో పుష్కలంగా లభిస్తుంది. ముఖ్యంగా పాలకూరలో లభిస్తుంది.. అందుకనే రక్తం చిక్కబడే లక్షణాలు ఉన్నవారిని ఆకు కూరలు ఎక్కువగా తినొద్దు అని ఆరోగ్య నిపుణులు చెబుతారు. కాల్షియం లోపం కారణంగా ఎముకలు తెలుసుగా మారిపోతాయి. చిన్నదానికి కింద పడిన కూడా ఎముకలు విరిగి పోతుంటాయి. ఎముకల నొప్పులు, కీళ్ల నొప్పులు ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి. ఎముకలు గుల్ల బారకుండా ఉండడానికి కె ఎక్కువగా ఆహార పదార్థాలు తీసుకోవాలి. మీ శరీరంలో తగినంత  పరిమాణంలో క్యాల్షియం, విటమిన్ కె తీసుకోకపోతే ముఖ్యంగా ఎముకలు గుల్ల బారతాయి.

అందుకని ఎక్కువగా విటమిన్ కె ఉన్న పదార్ధాలు తీసుకోవాలి. విటమిన్ కె ఎక్కువగా వంకాయలు, బచ్చలి, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, గోధుమలు, క్యారెట్, అల్లం, ఉల్లిపాయలు, పచ్చి బఠానీల లో లభిస్తుంది. మాంసాహారంలో కూడా విటమిన్ కె ఉంటుంది. ఎముకల తగ్గించడానికి బచ్చల కూర వరంగా చెప్పుకోవచ్చు. పప్పు తో లేదా నేరుగా వండుకుని తిన్నా కూడా మంచి ఫలితం ఉంటుంది. దీనిలో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. మోకాళ్ళ నొప్పులకు అద్భుత నివారిణి బచ్చలి కూర ని సైంటిస్ట్లు తెలిపారు. ఈ ఆకు రసాన్ని పలు ఔషధ తయారీలో నిర్వహిస్తున్నారు.

Vitamin K: for bone strength
Vitamin K: for bone strength

విటమిన్ కె అనేది విటమిన్ K1, విటమిన్ K2 అనే రెండు రూపాలను కలిగి ఉంది.. విటమిన్ K1 ఆకుకూరలు, కూరగాయల లో లభిస్తుంది. విటమిన్ K2 మాంసాహారంలో లభిస్తుంది. విటమిన్ కె తీసుకోవడం వలన ఎముక ఖనిజ సాంద్రతను పెంచుతుందని పలు అధ్యాయానాలలో నిరూపితమైంది. విటమిన్ కె మహిళలకు 90 మైక్రోగ్/డి, పురుషులకు 120 మైక్రోగ్/డి మోతాదులో తీసుకోవాలని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ ఇటీవల తెలిపింది. అందువలన ఎముకలకు సంబంధించిన బాధపడేవారు విటమిన్ కె పుష్కలంగా ఉన్న ఆహారాన్ని డైట్ లో భాగంగా చేసుకోవాలి. శరీరానికి తగినంత ఎండ తగలకపోయినా ఎముకల ఖనిజ సాంద్రత తగ్గుతుంది.. సబ్జా గింజలు ఎముకలు పెలుసు బారకుండా, విరిగిపోకుండా చేస్తుంది. వీటిలో క్యాల్షియం, మినరల్స్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. నీళ్లలో నానబెట్టుకుని సబ్జాని ప్రతిరోజు తాగటం వలన శరీరానికి కావల్సిన కాల్షియం అందుతుంది.

విటమిన్ కె గాయమైనప్పుడు రక్తం గడ్డ కట్టేలా చేయడం, ఎముకలు విరిగిపోకుండా చూడడమే కాకుండా మీ గుండె ను ఆరోగ్యంగా ఉంచుతుంది. ముఖ్యంగా హృదయానికి రక్తం సరఫరా చేసే ధమనులు గట్టిపడకుండా కంటికి రెప్పలా కాపాడుతుంది. మీ ధమనుల గోడలకు క్యాల్షియం పేరుకుపోకుండా చేస్తుంది. శరీరానికి గుండెకు రక్త సరఫరా లో ఎటువంటి అడ్డంకులు లేకుండా చేస్తుంది. మీ శరీరంలో క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేస్తుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది . అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది.

Read More :

Energy Drink: ఇంట్లో చేసుకోగలిగే ఈ ఒక్క ఎనర్జీ డ్రింక్ తో మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు పరార్..!!

Vakkaya: వామ్మో వాక్కాయ తింటే ఇన్ని ప్రయోజనాలా..!!

Gaddi Chamanthi: ఈ మొక్క ఎక్కడ కనిపించినా వేర్లతో సహా తెచ్చుకోండి.. ఎందుకంటే..


Share

Related posts

పెళ్లయ్యాక కాజల్ ను గౌతమ్ ఏం చేస్తున్నాడో చూడండి..! ఆమెకు ఇంకో ఆప్షన్ లేదాయే…

arun kanna

ఎముకల గూడులా చేసేశారు!

Kamesh

జమిలి జాతరే : 2022 లో ఎన్నికలేనా?

Special Bureau