(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
దేవీ నవరాత్రుల సందర్భంగా దేశవ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి. ఈ వేడుకలకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా గుజరాతీ గర్బా డాన్స్ వీడియోలు ఎక్కువగా తిరుగుతున్నాయి. ట్విట్టర్లో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే మహింద్రా యజమాని ఆనంద్ అలాంటి ఒక వీడియో చూసి, తాను దానిని చూస్తేనే అలసిపోయానని వ్యాఖ్యానించారు.
ఆ వీడియోకు ఇంటర్నెట్లో బాగా స్పందన వచ్చింది. ఇంతకీ ఆ డాన్స్ వీడియోలో ఉన్నది మహిళలు కారు. ఇద్దరు పురుషులు. మహా హుషారుగా వారు చేసే గర్బా డాన్స్ మీరు కూడా చూసి అనందించండి.
— nishit arvind vashi (@nishit29) October 4, 2019