ముంబై: భారీ వర్షాలతో వీధులన్నీ నీట మునిగిన ముంబై నగరంలో ఒక ఆకాశహర్మ్యం పైనుంచి జలపాతం లాగా నీరు కిందకు ఉరకడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే దానికి కారణం వర్షాలు కాదనీ, టవర్ పైన కట్టిన వాటర్ టాంక్ పగుళ్లు ఇచ్చి నీరు కిందకు జారిందని ఆ వీడియో పోస్టు చేసిన వ్యక్తి పేర్కొన్నాడు.
Waterfalls in New Cuffe Parade! #MumbaiRains pic.twitter.com/eqPQhGf73V
— K Sudarshan (@SudarshanEMA) September 4, 2019
సంపన్నులు నివసించే కఫె పరేడ్ ప్రాంతంలోని ఆ 40 అంతస్తుల భవనం ముందు నుంచుని చాలామంది అబ్బురంగా ఈ కృత్రిమ జలపాతాన్ని చూశారు. కొందరు మొబైల్ ఫోన్లో రికార్డు చేశారు. ట్విట్టర్లో ఈ వీడియో చూసి చాలామంది రకరకాల కామెంట్లు పెట్టారు. ఒక వ్యక్తి దీనిని చూసినందుకు దారిన పోయేవారి నుంచి రుసుము వసూలు చేయాలని సలహా ఇచ్చాడు.