NewsOrbit
Right Side Videos

సింధు వర్కవుట్ చూస్తే..!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

హేమాహేమీలతో తలపడి ప్రపంచ ఛాంపియన్ కావాలంటే మామూలు  మాటలు కావు. దాని వెనుక ఎంత కఠోర శ్రమ ఉంటుందో ఊహించుకోవాల్సిందే. ఇండియాకు ప్రపంచ ఛాంపియన్ షిప్ సాధించిపెట్టిన బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు వర్కవుట్ చూస్తే మతి పోవాల్సిందే. పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాకు కూడా అలాగే మతి పోయింది.

ఆ వర్కవుట్ చూస్తేనే తాను అలసిపోయానని మహింద్రా ట్వీట్ చేశారు. ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉండే  ఆనంద్ మహింద్రా సింధు వర్కవుట్ వీడియో ఒకటి పోస్టు చేశారు. హైదరాబాద్‌లోని సుచిత్ర బ్యాండ్మింటన్ అకాడెమీలో సింధు వ్యాయామం చేస్తుండగా తీసిన వీడియో అది.

కఠోరం. చూస్తేనే నాకు అలసట వచ్చేసింది. అయితే ఆమె ప్రపంచ ఛాంపియన్ షిప్ వెనుక గుట్టు మాత్రం తెలిసిపోయింది. ఓ తరం క్రీడాకారులు మొత్తం ఉన్నతస్థాయికి వెళ్లడానికి కావాల్సిన శ్రమకు వెరవకుండా సింధు ఆదర్శంగా కష్టపడతారు అని మహింద్రా ట్వీట్ చేశారు.

జపాన్ స్టార్ నొజోమి ఒకుహరాను 21-7, 21-7తో ఓడించి సింధు 2019 ప్రపంచ ఛాంపియన్ షిప్ సాధించింది. ఇండియాకు ఈ గౌరవం దక్కడం ఇదే మొదటిసారి.

Related posts

కర్ణాటక లో సాగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి సోనియా నడక

sharma somaraju

Video Viral: బాలుడిని గాయపర్చి కుక్క .. యజమానిపై కేసు నమోదు…ఎందుకంటే..?

sharma somaraju

Viral video: రీల్స్ మోజులో రైల్ ఢీకొని..

sharma somaraju

వీడియో : డ్రోన్ కి చిక్కిన మావో బలగాలు, పోలీసుల అప్రమత్తం..!

sharma somaraju

కరోనాతో కొత్త సమస్యలు: కంటే కన్నీళ్లు ఆగవు..!!

sharma somaraju

దగ్గుబాటి వారి పాకశాల…!

sharma somaraju

రాజుగారా…! మజాకా..!

sharma somaraju

చార్మీకి డ్రగ్స్ మైకం కమ్మిందేమో…!

sharma somaraju

వైరల్ వీడియో:బాహుబలి ట్రంప్

sharma somaraju

కొత్తూరు తాడేపల్లిలో ఎంఆర్ఒపై రైతుల ఆగ్రహం

sharma somaraju

విన్నూత్నంగా ‘ఎన్ ఆర్ ఐ’ ఎంగేజ్మెంట్ ఫంక్షన్

sharma somaraju

రోడ్డుపై రెచ్చిపోయిన బస్ డ్రైవర్!

Mahesh

ఫ్యాన్స్‌ని చూసి భయపడిన సన్నీ!

Mahesh

‘ఆడుకుందాం రా’ అంటున్న ఏనుగు!

Mahesh

సెల్ఫీకి ప్రయత్నం.. సల్మాన్ ఆగ్రహం!

Mahesh

Leave a Comment