NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

నరసాపురం ఉప ఎన్నిక సర్వే : వైకాపా కి మెజారిటీ డబల్ ?

గత కొద్ది రోజులుగా ఏపీ రాజకీయాల్లో విపరీతంగా వినిపిస్తున్న పేరు రఘురామకృష్ణంరాజు ది. వైఎస్ఆర్సీపీ తరఫున నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా గెలిచిన రామరాజు గారు ఒక్క సారిగా సొంత పార్టీకి మరియు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పి తెగ హడావుడి చేసారు. అంతటి అధికారం ఉన్న వైసిపి పార్టీ గుర్తింపు హోదా కే ఎసరు పెట్టిన అతని పై అనర్హత వేటు వేయించేందుకు స్వయంగా ఏపీ ఎంపీలు ఢిల్లీ వరకు వెళ్ళేలాగా చేశాడు. సరిగ్గా చెప్పాలంటే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కంటే వారి పార్టీలోనే ఉంటూ జగన్ ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు చేయడం రాజుగారికే చెల్లింది. అయితే ఇంత హడావుడి చేస్తూ కూడా తను ఇప్పటికీ పార్లమెంట్ అభ్యర్థిగా తన సొంత ఇమేజ్ గెలిచాను అనిఆయన డప్పు కొట్టుకోవడం గమనార్హం.

 

YSRCP MP Raghurama Krishnam Raju overwhelmed after being greeted ...

రాజు గారా….. ఆయన ఎవరు?

ఇకపోతే జగన్ లేకపోతే నువ్వు ఎప్పటికీ గెలవాలి అన్న వాడికి సమాధానంగా…. జగన్ బొమ్మకు కొన్ని ఓట్లు పడితే తన పేరుకి కూడా కొన్ని ఓట్లు పడ్డాయని…. అందుకే స్వల్ప మెజారిటీతో గండం గట్టెక్కింది అని రాజుగారు చెప్పుకుంటున్నారు. అయితే నిజంగా రాజుగారికి ప్రాంతంలో అంతటి పేరు ఉందా..? లేదా..? అక్కడ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అక్కడి జనం జగన్ ను చూసి ఓటు వేశారా లేదా రాజు గారికి సొంత ఇమేజ్ ఏదైనా ఉందా అని చూస్తే.. రాజుగారు చెప్పుకున్నట్లు అక్కడ పరిస్థితి అయితే లేదు. అసలు నరసాపురం పార్లమెంట్ లోని ప్రజలకు రఘురామకృష్ణంరాజు గారి గురించి పెద్దగా తెలియదు అని చెప్పాలి.

టీడిపి నయం కదయ్యా..!

ఇక నరసాపురం ఉప ఎన్నిక అనివార్యం అని అందరు ఫిక్స్ అయిపోయిన నేపథ్యంలో ఒక చిన్న అంతర్గత సర్వేను వైసీపి వారు నిర్వహిస్తే కరిద్దరు మినహాయించి నరసాపురం పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలందరూ జగన్ గాలిలోనే గెలిచారు అన్నది స్పష్టం. అక్కడి జనం జగన్ ను చూసే రాజుగారికి ఓటేశారు…. గట్టిగా చెప్పాలంటే టిడిపి నుంచి పోటీ చేసి ఓడిపోయిన వేటుకూరి శివరామరాజు అయినా నరసాపురం ప్రజలకు బాగా పరిచయస్థుడు కానీ బిజినెస్ చేసుకుంటూ ఎక్కువగా హైదరాబాద్, ఢిల్లీ వంటి నగరాలలో గడిపే రాజు గారి గురించి ఎవరికీ తెలియదు. కాబట్టి నరసాపురంలో రాజుగారికి అంత సీన్ లేదని రాజకీయ విశ్లేషకులు టాక్.

సొంతగా పోటీ చేశాడనుకో….

ఇకపోతే ఒకవేళ రాజుగారికి ఉప ఎన్నికలు వస్తే తిరిగి ఒంటరిగా పోటీ చేసి గెలిచే సత్తా ఉందా అంటే కచ్చితంగా ఆయన చిత్తుగా ఓడిపోవడం ఖాయమని తెలుస్తోంది. ఎందుకంటే ఇక్కడి తాజా పరిణామాలు, రాజు గారి పనులకు ప్రజల రియాక్షన్ చూస్తే అంతా జగన్ వైపే ఉన్నారు. రాజు గారిని విపరీతంగా తిట్టిపోస్తున్నారు. ఇకపోతే అంతర్గత సర్వేల్లో తేలింది ఏమిటంటే…. దాదాపు 58 శాతం వరకు ప్రజలు మళ్ళీ వైఎస్సార్సీపీని గెలిపించాలి అని చూస్తున్నారు. ఇక ఈ రచ్చ తర్వాత ఆ సంఖ్య మరో 15% శాతం స్పష్టంగా పెరిగిందట. ఇక టిడిపి అభ్యర్థి అయిన వేటుకూరి శివరామరాజు కి 37 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉండేదని.. జనసేన బిజెపిలకు ఒక 4 నుండి 5 శాతం వరకు ఓట్ల రావచ్చని అయితే రాజు గారి దెబ్బతో ఆ ఓట్లు కూడా వారికి రావని అర్థం అయిపోయింది.

రాజు ఇండిపెండెంట్ గా పోటీ చేసినా…. జనసేన బీజేపీ పొత్తు లో పోటీ చేసిన చిత్తుగా ఓడిపోవడం ఖాయమని దీని పరమార్థం. టిడిపి సపోర్ట్ తీసుకుని రాజు గారు నెగ్గుకురావడం కష్టం. మొత్తానికి అయితే రాజు గారి రాజకీయ భవిష్యత్తు చుక్కాని లేని నావలా ఉందని అందరూ అభిప్రాయ పడుతున్నారు.

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju

Video Morphing Case: అమిత్ షా డీప్ షేక్ వీడియో కేసు.. గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు ..సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు

sharma somaraju

బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల‌హీన నేత‌లు.. వైసీపీ సాధించేదేంటి..?

దెందులూరులో మా ఓడికి ఓట‌మే నో డౌట్‌… వైసీపీ లీడ‌ర్లే ఒప్పేసుకుంటున్నారే..?

ఏపీలో మేనిఫెస్టో జోష్ తుస్‌.. ఇంత షాక్ ఇచ్చారేంట‌బ్బా…?

పింఛ‌న్లు-ప‌రేషాన్లు.. వైసీపీ ఉచ్చులో టీడీపీ.. !

BRS: బీఆర్ఎస్ కు మరో షాక్ .. కాంగ్రెస్ కండువా కప్పుకున్న మరో కీలక నేత

sharma somaraju