NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Trs : లాజిక్ మిస్సవుతోందా..? బీజేపీని ఢీ కొట్టాలంటే.. ఆ ముద్ర వేసుకోవాలా..?

Trs.. లాజిక్ మిస్సవుతోందా..? బీజేపీని ఢీ కొట్టాలంటే.. ఆ ముద్ర వేసుకోవాలా..?

Trs : లాజిక్ మిస్సవుతోందా..? బీజేపీని ఢీ కొట్టడానికి ఆ ముద్ర వేసుకోవడానికి సిద్ధపడుతోందా? ‘ముల్లుని ముల్లుతోనే తీయాలి.., పోగొట్టున్న చోటే వెతుక్కోవాలి..’ అనేవి సామెతలను నిజం చేయాలని టీఆర్ఎస్ Trs  చూస్తోంది. తెలంగాణపై ఆధిపత్యం పోతుందనే భయమో.. పోయిందనే అంతర్మధనమో కానీ.. టీఆర్ఎస్ ఫ్రస్ట్రేషన్ లో ఉందనే చెప్పాలి. ఏకులా ఉండే బీజేపీ తెలంగాణలో మేకై కూర్చుంది. కవిత, దుబ్బాక ఉప ఎన్నిక ఓటములు, జీహెచ్ఎంసీ దెబ్బ.. ఇవన్నీ టీఆర్ఎస్ కు బీజేపీ నేర్పిన గుణపాఠాలే. అయితే.. ఇవి సాధారణ ఓటములైతే పర్లేదు. కానీ.. బీజేపీ ఆడిన ‘మతం’ అనే మైండ్ గేమ్ కావడమే టీఆర్ఎస్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్పుడు అయోధ్య రామమందిర నిర్మాణంలో భాగంగా బీజేపీ వసూలు చేస్తున్న చందాలు కూడా తెలంగాణలో చర్చనీయాంశమైంది. ఇందుకు ఆజ్యం పోసుకుంటోంది.. రాజకీయ వివాదానికి తెర తీస్తోంది కూడా టీఆర్ఎస్సే కావడం గమనార్హం.

Trs wrong way to fight with bjp
Trs wrong way to fight with bjp

బీజేపీ అడుగులు అటేనా..

మత రాజకీయాలే అనాలో.. హిందూత్వం అనాలో గానీ.. బీజేపీ అడుగులు అటే ఉన్నాయి. 2015లో అమరావతి నిర్మాణం కోసం ప్రజలు స్వచ్ఛందంగా చందాలివ్వాలని అప్పటి సీఎం చంద్రబాబు పిలుపు ఇవ్వడమే తరువాయి ఇటుకను 10 రూపాయల చొప్పున ఎవరి స్థోమతను బట్టి వారు కొనేసి చందాల రూపంలో ఆన్ లైన్లో ఇచ్చారు. ఇప్పుడు అయోధ్య రామమందిర నిర్మాణానికి చందాలు ఇవ్వాలంటూ బీజేపీ ఇంటింటికీ వెళ్తోంది. ఈ అంశాన్నే టీఆర్ఎస్ తప్పుబడుతోంది. ‘శ్రీరాముడి పేరుతో బీజేపీ రాజకీయం చేస్తోంది. రామాలయం నిర్మాణం పేరుతో బీజేపీ నేతలు డబ్బులు వసూలు చేస్తున్నారు. దొంగ పుస్తకాలు, చందాల ముసుగులో దందాలకు పాల్పడుతున్నారు. ఒక్క తెలంగాణలోనే రూ.1000కోట్లు వసూలు చేయాలనే లక్ష్యం. ఇక దేశం మొత్తం మీద ఎంత వసూలు చేస్తారో. బీజేపీ నేతలు వసూళ్లకు లెక్క చెప్పాల్సిందే. భక్తి పేరుతో బీజేపీ వికృత చేష్టలకు పాల్పడుతోంది’ అంటూ తీవ్ర స్థాయిలో  ధ్వజమెత్తారు. ఇవే వ్యాఖ్యలను వారం క్రితం కోరుట్ల ఎమ్మెల్యే విద్యసాగర్ రావు కాస్త అటుఇటుగా అనేశారు.

 

టీఆర్ఎస్సే ఆ ముద్ర వేసుకుంటుందా..

దీంతో ఏమీ లేని విషయాన్ని పట్టుకుని టీఆర్ఎస్ వివాదం చేస్తోంది. దీంతో ఎక్కడికక్కడ బీజేపీ శ్రేణులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. విద్యాసాగర్ రావుపై మాటల దాడి చేస్తే.. ఏకంగా ధర్మారెడ్డి ఇంటిపైనే రాళ్ల దాడి చేశారు. తర్వాత వీరిద్దరూ క్షమాపణ చెప్పారు.. అది వేరే సంగతి. కానీ.. ఈ వ్యాఖ్యలన్నీ టీఆర్ఎస్ అధినే కేసీఆర్ కు తెలీకుండానే జరుగుతున్నాయా అనేది ఓ ప్రశ్న. బీజేపీ నేతలు హద్దు మీరితే తెలంగాణలో తిరగనివ్వకుండా చేస్తాం.. అని కేటీఆర్ వార్నింగ్ ఇస్తే నిన్న సిరిసిల్లలో ఆయన పర్యటననే ఘెరావ్ చేశారు బీజేపీ కార్యకర్తలు. ఎర్రబెల్లి దయాకర్, కడియం శ్రీహరి కూడా బీజేపీ వసూలు చేస్తున్న చందాలను తప్పుబట్టినవారే. దీంతో తలా పాపం తిలా పిడికెడు అన్నట్టు టీఆర్ఎస్ నాయకుల వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల్లో.. టీఆర్ఎస్ హిందూ వ్యతిరేకి అనే ముద్రను స్వయంగా వేసుకుంటోంది. వ్యవసాయ బిల్లులపై ధూం ధాం అన్న కేసీఆర్ ఢిల్లీ పర్యటన తర్వాత మద్దతిచ్చేశారు. అంటే బీజేపీకి తలొగ్గారో.. సై అంటున్నారో తెలీదు కానీ.. టీఆర్ఎస్ చేసుకుంటున్న డ్యామేజీని అడ్డుకోవడం లేదు. ఇదే తమకు కావాల్సిందని బీజేపీ రాష్ట్రంలో ఇలా టీఆర్ఎస్ నుంచి అయోధ్యపై వ్యతిరేక వార్త రాగానే అలా ఫైర్ అయిపోయి.. హిందూత్వ సెంటిమెంట్ తో ప్రజలను తమ వైపుకు తిప్పుకుంటోంది.

 

టీఆర్ఎస్ జాగ్రత్త పడకపోతే..

ప్రస్తుతం టీఆర్ఎస్ కు, సీఎం కేసీఆర్ కు తెలంగాణలో వార్తల్లో నిలిచే అంశం లేదు. బీజేపీని ఎటాక్ చేస్తున్నాం అనుకుంటున్నారు కానీ.. బీజేపీ హిందూత్వ ముసుగులో టీఆర్ఎస్ కు భారీ దెబ్బ వేస్తోంది. తెలంగాణ తెచ్చినప్పుడు ప్రజల్లో టీఆర్ఎస్ ఉన్న ఉత్సాహం ఇప్పుడు లేదు. వారి ఆధిపత్య ధోరణే వారికి చిక్కులు తెచ్చిపెడుతోంది. తెలంగాణ సెంటిమెంట్ ఎప్పుడో చల్లారిపోయింది. సెంటిమెంట్, కేసీఆర్ వాక్చాతుర్యం ఎల్లకాలం కాపాడలేదు. వ్యూహాత్మకంగా బీజేపీ వేస్తున్న అడుగులు వారికి ప్లస్. ఇటివల అదే చల్లా ధర్మారెడ్డి ఒక కులాన్ని ఉద్దేశించి.. ‘ఆ కులంలో అధికారులకు ఏమీ రాదు.. అగ్రకులాల వారి ఉద్యోగాలు దక్కించుకోవడం తప్ప’ అనే వ్యాఖ్యలు కూడా ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ కు నిప్పు పెడుతున్నాయి. ఇలా ఒక్కో అంశంలో స్వయంగా దెబ్బలు వేసుకుంటూ.. ‘ఇదంతా మాదే’ అని జబ్బలు చరుచుకునే భ్రమ నుంచి టీఆర్ఎస్ బయటకు రావాల్సి ఉంది.

 

 

Related posts

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !