NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: నాడు రద్దు.. నేడేమో అదే ముద్దు! జగన్ మాట తప్పి మడమ తిప్పిన ఉదంతం ఇదే!

YS Jagan: మాట తప్పడు..మడమ తిప్పడు అన్న ఇమేజ్ సొంతం చేసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసనమండలి రద్దు సిఫార్సు తీర్మానం వెనక్కు తీసుకొని రాజకీయంగా మసకబారారని వ్యాఖ్యలు వినవస్తున్నాయి.

This is the case where YS Jagan missed the word and turned his heel!
This is the case where YS Jagan missed the word and turned his heel!

ఈ విషయంలో తన చర్యను సమర్థించుకునే అవకాశాన్ని కూడా జగన్ కోల్పోయారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే అసలు శాసనమండలి రద్దుకు ముఖ్యమంత్రి నిర్ణయించడమే ఒక పొరపాటైతే , దాన్ని తిరిగి ఉపసంహరించుకోవటం అనేది సరిదిద్దలేని తప్పిదమనేది వారి విశ్లేషణ. రెండున్నరేళ్ల పాలనలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ తీసుకున్న అనాలోచిత నిర్ణయం ఇదొక్కటే నంటున్నారు.

YS Jagan: కాస్త వెనక్కి వెళితే…!

ప్రతిపక్షంలో ఉండగా జగన్ కు శాసనమండలి అంటే వ్యతిరేకత లేదు.పార్టీలో ఉన్న చాలామందికి తాను అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తానని ఆయన బుజ్జగించిన దాఖలాలు కూడా ఉన్నాయి.మొన్నటి ఎన్నికల్లో నూటయాభైఒక్క సీట్లతో వైసిపి అఖండ విజయం సాధించి జగన్ ముఖ్యమంత్రి అయ్యారు.కానీ ఆ నాటికి శాసన మండలిలో టిడిపికి బలం ఉంది. శాసనసభలో ఎదురు లేకున్నా మండలిలో ప్రభుత్వ బిల్లులకి చుక్కెదురవుతోంది.ముఖ్యంగా జగన్ మానస పుత్రికైన మూడు రాజధానుల బిల్లును శాసన మండలి తిరస్కరించింది.దీంతో భగ్గుమన్న జగన్ అసలు శాసనమండలి వద్దంటూ అసెంబ్లీ చేత తీర్మానం చేయించి కేంద్రానికి పంపారు. ఇది ఢిల్లీలో పెండింగ్లో ఉంది

ఈ లోపు ఏమియిందంటే?

శాసనమండలి అనేది నిరంతరం ఉండేది కాబట్టి ఎప్పుడు ఖాళీ అయ్యే సీట్లను అప్పుడే భర్తీ చేయాల్సి ఉంటుంది.పైగా చట్టాల ప్రకారం ఎప్పుడూ శాసన మండలిలో అధికార పార్టీకే ఎడ్జ్ ఉంటుంది.వివిధ పద్ధతుల్లో తమ పార్టీ వారిని ఎమ్మెల్సీలు చేసుకునే సౌలభ్యం రూలింగ్ పార్టీ కి వుంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇరవై మూడు సీట్లతో చతికిలపడ్డ టీడీపీకి కౌన్సిల్ లో ఒక్క స్థానాన్ని దక్కించుకునే బలం కూడా లేదు.ఆ ప్రకారమే వైసిపికి శాసనమండలిలో మెజారిటీ కూడా వచ్చేసింది.దీంతో జగన్ ప్రభుత్వం శాసనమండలి రద్దుకు తాము చేసిన సిఫార్సు తీర్మానాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు అసెంబ్లీలో తాజాగా మరో రిజల్యూషన్ చేయించి కేంద్రానికి పంపారు.

YS Jagan: ఏ విధంగా సీఎం సమర్ధించుకుంటారు?

అయితే అప్పుడు రద్దు అన్న శాసనమండలి ఇప్పుడు ఎందుకు ముద్దు అయ్యిందో చెప్పుకోగలిగిన స్థితిలో జగన్ లేరన్నది వాస్తవం. అంతా మా ఇష్టం అని జగన్ వాదిస్తే చేసేదేమీ లేదు కానీ మళ్లీ కౌన్సిల్ అవసరం ఎందుకు వైసిపికి కలిగిందో సహేతుకంగా సీఎం చెప్పలేరన్నది నిర్వివాదాంశం.సాధారణంగా నాయకుడంటే ముందుచూపు ఉండాలి.ముఖ్యమంత్రికి ఇది మరింత అవసరం.శాసనమండలి రద్దుకు నిర్ణయం తీసుకున్నప్పుడే సీఎంకు రెండేళ్లలో వైసీపీకి కౌన్సిల్లో పూర్తి మెజారిటీ వస్తుందని తెలియదనుకోవాలా?ఏ లెక్కలూ లేకుండానే శాసనమండలి రద్దుకు ఆయన సిఫార్సు చేసారని భావించాలా? ఏదేమైనా ఇప్పుడు మెజారిటీ వచ్చాక శాసనమండలి రద్దు సిఫార్సు తీర్మానం వెనక్కు తీసుకోవటం ద్వారా జగన్ తన వైఖరిని తానే సడలించుకుని నలుగురికి సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

 

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju