“ORMAX MEDIA” సర్వే ఇండియాలోనే మంచి పేరుగాంచిన సంస్థ. ఈ క్రమంలో తాజాగా “ORMAX MEDIA” సంస్థ నిర్వహించిన సర్వేలో టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక ప్రేక్షక ఆధారణ పొందిన సినిమా యాక్టర్ జాబితాలో మొదటి స్థానాన్ని ప్రభాస్ కైవసం చేసుకున్నాడు. బాహుబలి 2 వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత విడుదలైన సాహో, రాదేశ్యం 2 అట్టర్ ప్లాప్ అయినా గాని.. క్రేజ్ పరంగా ప్రేక్షకులలో ప్రభాస్ కి ఏమాత్రం తగ్గలేదని “ORMAX MEDIA” సంస్థ పేర్కొంది.
ఇక ప్రభాస్ తర్వాత ఎన్టీఆర్ రెండవ స్థానంలో నిలిచాడు. RRR తో తారక్ ఇండియాలోనే భారీ క్రేజ్ దక్కించుకోవడం..తో పాటు ప్రపంచంలో అనేక దేశాలలో ఎన్టీఆర్ కి మంచి గుర్తింపు లభించింది. దీంతో “ORMAX MEDIA” సర్వే అత్యంత ప్రేక్షక ఆదరణ విషయంలో రెండో స్థానంలో నిలిచాడు. ఇక పుష్ప తో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయినా ఆలు అర్జున్ మూడవ స్థానంలో నిలిచాడు. ఇక నాలుగో స్థానంలో మహేష్ బాబు, ఐదవ స్థానంలో రామ్ చరణ్, ఆరవ స్థానంలో పవన్ కళ్యాణ్, ఏడవ స్థానంలో నాని, ఎనిమిదవ స్థానంలో చిరంజీవి, తొమ్మిదవ స్థానంలో విజయ్ దేవరకొండ పదవ స్థానంలో రవితేజ అత్యధిక ప్రేక్షకాదరణ కలిగిన “ORMAX MEDIA” సంస్థ హీరోల జాబితాలో స్థానాలు దక్కించుకున్నారు.
ఇక ఇదే సంస్థ నిర్వహించిన హీరోయిన్ ల విషయంలో మొదటి స్థానంలో నయనతార ఆ తర్వాత సమంత, కీర్తి సురేష్, త్రిష, ప్రియాంక మోహన్, తమన్నా, జ్యోతిక, పూజా హెగ్డే, రేష్మిక మందన, అనుష్క… నిలిచారు. వీళ్లంతా తెలుగు సినిమా రంగంలో అత్యధిక ప్రేక్షక ఆదరణ.. హీరో… హీరోయిన్ లుగా నిలవడం జరిగింది. “ORMAX MEDIA” సర్వే ఇండియాలోనే పేరుగాంచిన సంస్థ.