Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ నాలుగో వారం ఆట చివరికి వచ్చేసింది. మొత్తం 20 మంది సభ్యులు హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగా. నాలుగో వారం గేమ్ వచ్చేసరికి దాదాపు హౌస్ నుండి ముగ్గురు ఎలిమినేట్ కాగా ప్రస్తుతం నామినేషన్ లో పదిమంది ఉన్నారు. వీరిలో ఎవరు హౌస్ నుండి ఎలిమినేట్ అవుతారన్నది సస్పెన్స్ గా మారింది. ఓటింగ్ ప్రకారం చూసుకుంటే సుదీప, ఆరోహి ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పరిస్థితి ఇలా ఉంటే హౌస్ లో నాలుగో వారం కెప్టెన్సీ టాస్క్ లో కీర్తి సత్తా చాటింది.
నాలుగో వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ లో భాగంగా “బీబీ హోటల్” టాస్క్ ఇవ్వడం తెలిసిందే. ఈ టాస్క్ లో ఫెమా టీం గెలిచింది. అయినా గాని కెప్టెన్సీ టాస్క్ లో ఇంటి సభ్యులే ఎన్నుకునే రీతిలో టాస్క్ లు నిర్వహించడం జరిగింది. కెప్టెన్సీ టాస్క్ బరిలో చివరిలో కీర్తి, సుదీప, శ్రీ సత్య నిలవగా చివరాఖరికి కీర్తి గెలవడం జరిగింది. హౌస్ లో మొదటి నుండి కీర్తి తన బెస్ట్ ఇస్తూ ఉంది. పాయింట్ మాట్లాడాల్సిన సమయంలో గట్టిగానే మాట్లాడుతూ ఉంది.
ఇంకా మూడో వారంలో తనకి జీరో మార్కులు రావడం.. ఎంతో బాధకి గురి చేసింది. గుక్క పెట్టి మరీ ఏడ్చేసింది. కానీ అనూహ్యంగా నాలుగో వారం అందరి అంచనాలను తలకిందులు చేసి కీర్తి కెప్టెన్ కావడం సంచలనంగా మారింది. ఈ వారం హోటల్ టాస్క్ లో పెద్దగా గేమ్ ఆడకపోయినా గానీ కీర్తికి కెప్టెన్ పదవి రావడంతో బిగ్ బాస్ ఆడియన్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు. కెప్టెన్సీ టాస్క్ పంచ్ గేమ్ లో.. ఇంటి సభ్యుల మధ్య వాడి వేడి పోటీ నడిచింది. కెప్టెన్సీ బరిలో ఓడిపోయిన శ్రీహాన్, ఆరోహి ఎంతగానో ఏడ్చారు.