NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

కేరళ హైకోర్టులో వైస్ ఛాన్సలర్లకు స్వల్ప ఊరట

కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ఇచ్చిన ఆదేశాలపై తొమ్మిది యూనివర్శిటీల వైస్ ఛాన్సలర్ లు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. వీసీల తరపు న్యాయవాదులు అత్యవసరంగా పిటిషన్ విచారించాలని కోరడంతో దీపావళి పండుగ సెలవు దినం అయినప్పటికీ హైకోర్టు ఈ అంశంపై ప్రత్యేకంగా ఈ సాయంత్రం విచారణ జరిపింది. సోమవారం (ఈరోజు) 11.30 గంటలకల్లా రాజీనామాలు సమర్పించాలంటూ నిన్న ఇచ్చిన ఆదేశాలపై వైస్ చాన్సలర్ లు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు స్వల్ప ఊరట నిస్తూ ఆదేశాలు ఇచ్చింది. గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ తుది ఆదేశాలు జారీ చేసే వరకూ వీరు పదవుల్లో కొనసాగవచ్చునని హైకోర్టు తెలిపింది.

Kerala High Court

 

వైస్ ఛాన్సలర్ లు హైకోర్టు ను ఆశ్రయించిన తర్వాత గవర్నర్ మరొక నోటీసును జారీ చేశారు. విశ్వ విద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ లుగా కొనసాగించేందుకు గల చట్టబద్దమైన హక్కును వివరిస్తూ నవంబర్ 3వ తేదీ సాయంత్రం అయిదు గంటల ల్లోగా సమాధానాలు సమర్పించాలని ఆదేశించారు. సమాధానాలు ఇవ్వడంలో విపలమైతే, ఈ నియామకాలు చెల్లనివిగా, చట్టవిరుద్దమైనవిగా పరిగణిస్తామని తెలిపారు. విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్ (కులపతి) గా గవర్నర్ వ్యవహరిస్తారని, వైస్ ఛాన్సలర్ (ఉప కులపతుల) లను నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తెలిపారు. ఈ సందర్బంగా సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ నిబంధనలకు విరుద్దంగా ఈ నియామకాలు జరిగాయని పేర్కొన్నారు. సక్రమంగా నియామకాలు జరిపేందుకు వీలుగా పదవులకు రాజీనామా చేయాలని వీసీలను కోరారు.

Kerala Governor

 

కేరళ సర్కార్ నియమించిన తొమ్మిది విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ లకు తొలగించేందుకు గవర్నర్ నోటీసులు జారీ చేయడంపై సీఎం పినరయి విజయన్ స్పందించారు. రాష్ట్రంలోని విశ్వ విద్యాలయాలను నాశనం చేయాలనే ఉద్దేశంతో యుద్దం ప్రకటించారని ఆరోపించారు. సంఘ్ పరివార్ నాయకుడిగా ఆయన (గవర్నర్) వ్యవహరిస్తున్నారని సీఎం మండిపడ్డారు. ఇటీవల గవర్నర్ ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం మద్యం, లాటరీ టికెట్ల వ్యాపారాన్ని ఆదాయ వనరుగా చూసుకుంటుందని ఆక్షేపణ వ్యక్తం చేశారు.

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju