Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో గతవారం అర్జున్ కళ్యాణ్ హౌస్ నుండి ఎలిమినేట్ కావటం తెలిసిందే. ఎవరు ఊహించని రీతిలో అర్జున్ ఎలిమినేట్ అయ్యారు. వాస్తవానికి మెరీనా లేదా రాజ్ హౌస్ నుండి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయని టాక్ గట్టిగా వినిపించింది. కానీ అర్జున్ ఎలిమినేట్ అయ్యాడు. హౌస్ లో ఏడు వారాలు ఉన్న అర్జున్ మొదటి రెండు వారాలు చాలా స్లోగా గేమ్ ఆడాడు. ఎక్కువగా తన ఫోకస్ మొత్తం శ్రీ సత్య పైన పెట్టడం జరిగింది. ఆమె కోసం హౌస్ లో చాలా త్యాగాలు కూడా చేశాడు. శ్రీ సత్య కోసం నామినేషన్ లోకి కూడా వెళ్లడం జరిగింది. అయితే గేమ్ చాలా సీరియస్ గా దూకుడుగా అర్జున్ స్టార్ట్ చేసిన టయానికి ఏడో వారంలో హౌస్ నుండి ఎలిమినేట్ కావడం దురదృష్టకరం.
ఈ క్రమంలో బయట పలు సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ లకి అర్జున్ ఇంటర్వ్యూ ఇస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. అవకాశాల కోసం చాలా ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్న సమయంలో శ్రీ సత్య నాకు ఫోన్ చేసి బిగ్ బాస్ కి వెళ్తున్నట్టు తెలిసింది. దీంతో నేను కూడా ట్రై చేశాను. ఎందుకంటే బిగ్ బాస్ వేదికపై కనిపిస్తే చాలామందికి రీచ్ అవుతాం.. అన్న ఉద్దేశంతో ట్రై చేస్తే అవకాశం దొరికింది. కానీ ఎలిమినేట్ అయిన రోజు బిగ్ బాస్ షోలోకి సత్య వలన వచ్చినట్టు చెప్పాను. కానీ చాలామందికి సత్య కోసం వచ్చినట్టు అర్థం చేసుకున్నారు. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన సమయంలో అక్కడ పరిస్థితులు అర్థం చేసుకోవడానికి చాలా టైం పట్టింది.
నాలుగో వారంలో నామినేట్ అయిన సమయంలో చాలా టెన్షన్ పడ్డాను. ఆ తర్వాత పెద్దగా ఏమీ అనిపించలేదు. ఇంకా అప్పటినుండి మెల్లమెల్లగా గేమ్ మెరుగుపరుచుకుంటూ ఆడాను. ఇంకా అంతా బాగుంది. అన్ని రకాలుగా హౌస్ లో సెట్ అయ్యాను. నా మీద నాకు నమ్మకం కలుగుతుంది అని అనుకున్న సమయంలో హౌస్ నుండి ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. ఇది ఎంత మాత్రం అనుకోలేదు అంటూ .. తన ఎలిమినేషన్ గురించి అర్జున్ తెలియజేయడం జరిగింది.