Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ పదవ వారంలో ఇద్దరు హౌస్ నుండి ఎలిమినేట్ అయిపోయారు. శనివారం ఎపిసోడ్ లో బాలాదిత్య, ఆదివారం ఎపిసోడ్ లో వాసంతి ఎలిమినేట్ కావడం జరిగింది. ఎవరు ఊహించని రీతిలో డబల్ ఎలిమినేషన్ అని ప్రకటించడం ఇంటి సభ్యులకు షాక్ ఇచ్చినట్లయింది. హౌస్ లో చాలా అందంగా ఎక్కడ కూడా నెగిటివ్ లేకుండా వాసంతి ఆడటం జరిగింది. ఏది ఉన్న గాని ముఖంపైనే చెప్పేసేది. ప్రారంభంలో కొన్ని వారాలు పాటు ఎవరితో కూడా అంతగా కలవలేకపోయింది. టాస్క్ ఆడే సమయంలో కూడా.. తన దాక వస్తే తప్ప ఎక్కువగా కూడా రియాక్ట్ అయ్యేది కాదు.
కానీ కొన్ని వారాలు తర్వాత వాసంతి.. గేమ్ పరంగా దూకుడుగా రెచ్చిపోయింది. ఫిజికల్ టాస్క్ ఇంకా నామినేషన్ టైం లో ప్రతి విషయంలో కూడా చాలా చురుకుగా ఆడింది. పాయింట్ టు పాయింట్ మాట్లాడటంలో, క్లియర్ కట్ గా తన పాయింట్ చెప్పటంలో ఎక్కడ కూడా మొహమాటం పడేది కాదు. దాదాపు 10 వారాలు పాటు హౌస్ లో అద్భుతంగా రాణించిన వాసంతి… ఆదివారం ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయిపోయింది. అయితే ఈ క్రమంలో ఆదిరెడ్డి, ఫైమా, రాజ్ ముగ్గురు గేమ్ పరంగా హౌస్ లో ఫేక్ అని ఆ ముగ్గురికి షాక్ ఇచ్చింది.
ఇంకా రేవంత్, ఇనాయా, మెరీనా, కీర్తి బెస్ట్ అని… నాగార్జునతో వేదికపై తన అభిప్రాయాన్ని తెలిపింది. అందరూ బాగా ఆడాలని ఆల్ ది బెస్ట్ చెప్పి హౌస్ నుండి వాసంతి వెళ్ళిపోయింది. దీంతో ఇప్పుడు హౌస్ లో మొత్తం పదిమంది ఉన్నారు. పదిమందిలో ఎవరు టాప్ ఫైవ్ లో ఉంటారు అన్నది సస్పెన్స్ గా మారింది. ఇదిలా ఉంటే ఆదివారం ఎపిసోడ్ లో సీజన్ 6 విన్నర్ గా గెలిస్తే 50 లక్షల రూపాయలు వస్తాయని నాగార్జున స్పష్టం చేశారు. కాబట్టి అందరూ ఇకనుండి చాలా జాగ్రత్తగా ఆడాలని సూచించారు.