NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై మరో సారి ఘాటు వ్యాఖ్యలు చేసిన సీఎం వైఎస్ జగన్

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లపై మరో సారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు సీఎం వైఎస్ జగన్. నిజాంపట్నంలో మత్స్యకార భరోసా సభ వేదికగా సీఎం వైఎస్ జగన్ వారిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై ఘాటుగా విమర్శించారు. ఆ ఇద్దరికీ ఒంటరిగా 175 స్థానాల్లో పోటీ చేసే ధమ్ము ధైర్యం లేదంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలప్పుడే చంద్రబాబుకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు గుర్తొస్తారని అన్నారు. బాబు, తన దత్త పుత్రుడు నమ్ముకున్నది పొత్తులు, కుయుక్తులనేనని విమర్శించారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం గుర్తు రాదని, ఆయన పేరు తలిస్తే గుర్తుకొచ్చేది వెన్నుపోటేనని అన్నారు. పేదలకు మంచి చేయని ఈ వ్యక్తికి ఎవరైనా ఎందుకు మద్దతు ఇస్తారని ప్రశ్నించారు జగన్.

YS Jagan Slams chandrababu and pawan kalyan

చంద్రబాబు అధికారంలో ఉంటే అమరావతి.. అధికారం పోతే జూబ్లిహిల్స్ లో ఉంటారని దుయ్యబట్టారు. ఏపిలో దోచుకుని హైదరాబాద్ లో ఉంచడం వీరి పని అని మండిపడ్డారు. అయితే ఏపిలోనే తన శాశ్వత నివాసం ఉందని, తాడేపల్లిలో ఇళ్లు కట్టుకొని ఉంటున్నట్లు సీఎం పేర్కొన్నారు. చంద్రబాబుకు పెద్ద మైదానాల్లో సభలు పెట్టే ధైర్యం కూడా లేదని, ఇరుకు సందుల్లో సభలు పెడతారని అన్నారు. ఆయన పార్టీ వెంటిలేటర్ పై ఉందని ఎద్దేవా చేశారు. రెండు చోట్ల పోటీ చేస్తే మాకు ఎమ్మెల్యేగా వద్దని రెండు చోట్ల కూడా దత్తపుత్రుడ్ని ప్రజలు ఓడించేరన్నారు. పదేళ్లుగా రాజకీయ పార్టీ పెట్టిన దత్తపుత్రుడు 175 చోట్ల అభ్యర్ధులను పెట్టలేని పరిస్థితిలో ఉన్నాడన్నారు. నాకు సీఎం పదవి వద్దు.. దోపిడీ వాటా చాలని దత్తపుత్రుడు అంటున్నాడన్నారు. గజ దొంగల ముఠాగా దొచుకోవడానికి వీరంతా కలుస్తున్నారనీ, వీళ్లంతా ఎందుకు కలుస్తున్నారో ప్రజలు ఆలోచించాలన్నారు సీఎం జగన్.

ఎన్ని వ్యవస్థలను నాపై ప్రయోగించినా 15 ఏళ్లుగా ఎక్కడా రాజీపడలేదన్నారు జగన్. ప్రజల తరపున నిలబడ్డా, మంచి పనులు చేస్తున్నానన్నారు. మీకు మంచి జరిగితే మీ బిడ్డకు తోడుగా నిలవండి అని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధాన మంత్రి, రాష్ట్రపతిని కలిస్తే తనపై దుష్ప్రచారం చేస్తారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ తో అంటకాగిన వాళ్లు తనను విమర్శిస్తున్నారన్నారు. పొత్తులు పెట్టుకొని.. తెగదెంపులు చేసుకునేది వీళ్లే.. వివాహాలు చేసుకునేది వీళ్లే.. విడాకులు తీసుకునేది వీళ్లే అంటూ సెటైర్లు వేశారు. చంద్రబాబుకు ఏది మంచి జరిగితే దత్తపుత్రుడు అదే చేస్తానంటాడన్నారు. ఏ పార్టీని కలవాలో దత్తపుత్రుడికి చంద్రబాబే చెప్తాడు, బాబు చెప్తే దత్తపుత్రుడు బీజేపీ పక్కన చేరతాడు. బీజేపీకి విడాకులు ఇవ్వమని చంద్రబాబు చెబితే ఇచ్చేస్తాడు అంటూ పవన్ పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.  వీళ్లు చేస్తున్నది రాజకీయ పోరాటం కాదనీ, అధికారం కోసం ఆరాటమని, పేదలకు మంచి చేయాలన్న తపన, తాపత్రయం వారికి లేదని జగన్ విమర్శించారు.

Breaking: అవినాష్ రెడ్డి విజ్ఞప్తిపై సీబీఐ స్పందన ఇదీ ..

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju