న్యూఢిల్లీ: భారత వాయుసేన 87వ వార్షిక దినోత్సవ వేడుకలు మంగళవారం ఢిల్లీ సమీపంలోని హిండన్ ఎయిర్ బేస్ వద్ద ఎంతో ఉత్సాహంగా, కన్నుల పండుగగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన వైమానిక విన్యాసాలు అలరించాయి. ఎయిర్ ఫోర్స్ డే పరేడ్లో అభినందన్ వర్థమాన్ సహా బాలోకోట్ దాడుల్లో పాల్గొన్న వాయుసేన పైలెట్లు యుద్ధ విమానాలు నడిపి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
గత ఫ్రిబవరి 27న డాగ్ఫైట్లో పాక్ ఎఫ్ -16 యుద్ధ విమానాన్ని కూల్చివేసిన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్కు ప్రభుత్వం వీర్ చక్ర అవార్డును ప్రదానం చేసిన విషయం తెలిసిందే. ఈ పరేడ్లో అభినందన్ వర్థమాన్ మిగ్ -21 బైసన్ యుద్ధ విమానాన్ని నడిపి తన సాహసకృత్యాలను మరో సారి ప్రదర్శించారు.
Ghaziabad: Aircraft of Indian Air Force fly at Hindon Air Base during the event on #AirForceDay today. Wing Commander #AbhinandanVarthaman flew a MiG Bison Aircraft, 3 Mirage 2000 aircraft & 2 Su-30MKI fighter aircraft were also flown by pilots who took part in Balakot air strike pic.twitter.com/nlEqavrj3w
— ANI UP (@ANINewsUP) October 8, 2019
#WATCH Ghaziabad: Wing Commander #AbhinandanVarthaman leads a 'MiG formation' and flies a MiG Bison Aircraft at Hindon Air Base on #AirForceDay today. pic.twitter.com/bRpgW7MUxu
— ANI UP (@ANINewsUP) October 8, 2019