NewsOrbit
న్యూస్

‘ప్రజా హక్కులు కాపాడేలా డిజిపి వ్యవహరించాలి’

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

అమరావతి:  చట్టానికి, రాజ్యాంగ విలువలకు కట్టుబడి ప్రజా హక్కులను కాపాడేలా డిజిపి వ్యవహరించాలని టిడిపి అధినేత చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసిపి నాయకుల ప్రదర్శనలకు, ర్యాలీలకు అనుమతిస్తున్నారనీ, పోలీసులు దగ్గరుండి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారని అన్నారు. వారికి 144, పోలీస్‌ యాక్ట్‌ 30ని వర్తింపజేయడం లేదు  కానీ జెఏసి ఆధ్వర్యంలో మూడు రాజధానులు వద్దు.. అమరావతే రాజధానిగా కావాలి అంటూ ప్రజలు శాంతియుతంగా రాజ్యాంగం కల్పించిన హక్కు మేరకు నిరసన తెలపడాన్ని కఠిన నిర్బంధ చర్యలతో అడ్డుకుంటున్నారని చంద్రబాబు విమర్శించారు.

దుర్గమ్మకు మొక్కు తీర్చుకోవడానికి పొంగళ్లు తీసుకెళ్తున్న మహిళలపై దౌర్జన్యం చేయడం ప్రజా హక్కులను కాలరాయడం కాదా అని ప్రశ్నించారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న మహిళలను బూటు కాళ్లతో తన్నడం, లాఠీలతో బాదడం చట్టాన్ని దుర్వినియోగం చేయడం కాదా అని మండిపడ్డారు. దీర్ఘ కాలం 144 సెక్షన్‌ అమలు చేయడం చట్ట విరుద్దమని సుప్రీం కోర్టు చెప్పినా కూడా అమరావతి పరిధిలో సుదీర్ఘ కాలం అమలు చేయడం దుర్మార్గం కాదా అని చంద్రబాబు ప్రశ్నించారు.

మహిళలపై పోలీసులు దౌర్జన్యం చేస్తూ గాయాలపాలు చేసి ఆసుపత్రుల్లో చేరేలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుత నిరసనలకు అనుమతులు ఎందుకు నిరాకరిస్తున్నారని ప్రశ్నించారు.  ఈ రకంగా వివక్షా పూరితంగా పోలీసులు వ్యవహరిస్తే డిజిపి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. చట్టబద్ద చర్యలకు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు.  ఇకనైనా చట్టానికి, రాజ్యాంగ విలువలకు కట్టుబడి ప్రజా హక్కులను కాపాడేలా డిజిపి వ్యవహరించాలని చంద్రబాబు హితవుపలికారు.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Leave a Comment