(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
కురులు అంటే ప్రేమ లేనివారు ఎవరైనా ఉంటారా? కేశ సంరక్షణ విషయంలో నేటి యువత అసలు కాంప్రమైజ్ అవ్వరంటే అతిశయోక్తి కాదేమో! అందంగా, ఆకర్షణీయంగా కనిపించడానికి రకరకాల హెయిర్ స్టైల్స్ వేసుకొంటూ ఉంటారు. కాలంతో పాటు కొత్త కొత్త హెయిర్ స్టైల్స్ పుట్టుకొస్తున్నాయి. హెయిర్ స్టైల్స్ సెట్ చేసుకుంటూ జుట్టుతో ప్రయోగాలు చేస్తున్నారు. తాజాగా ఓ హెయిర్ స్టైల్ నిపుణుడు వెరైటీగా ఓ హెయిర్ స్టైల్‌ను ప్రయత్నించాడు. జుట్టును స్టైల్ చేయడానికి మంటను ఉపయోగించాడు.
https://twitter.com/JoshuaGrubbsPhD/status/1221605395061530627
జట్టును దువ్వి ఆపై దానికి మంట పెట్టగా.. అది చల్లారడానికి వస్తుంటే దాన్ని వెంట వెంటనే రెండు దువ్వెనలతో స్టైల్‌గా క్రాఫ్ సెట్ చేశాడు. అయితే కస్టమర్ మాత్రం ఎలాంటి నొప్పి లేకుండా ప్రశాంతంగా కూర్చుని ఉన్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టిక్ టాక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ అన్నింట్లో కలిసి ఇప్పటి వరకు ఈ వీడియోను 43 మిలియన్ల మంది వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
https://twitter.com/Kvos77/status/1221834021619097601
https://twitter.com/Chanakya2019/status/1222001131259408385
https://twitter.com/Pauljvergouwe/status/1221791632032456704