Nara Lokesh: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర కడప జిల్లాలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కడప జిల్లా జమ్మలమడుగులో ముగిసింది. పాదయాత్రకు నాలుగు రోజులు విరామం ప్రకటించారు నారా లోకేష్. ఈ నెల 27,28 తేదీల్లో రాజమండ్రి లో టీడీపీ మహానాడు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందు కోసం లోకేష్ పాదయాత్రకు విరామం ప్రకటించారు. తిరిగి ఈ నెల 30వ తేదీన జమ్మలమడుగు నుంచే పాదయాత్రను లోకేష్ ప్రారంభించనున్నారు.

జమ్మలమడుగులో పాదయాత్ర ముగించుకున్న నారా లోకేష్ కడప ఎయిర్ పోర్టుకు బయలుదేరి వెళ్లారు. అక్కడ నుండి ప్రత్యేక విమానంలో లోకేష్ గన్నవరం చేరుకుని అక్కడ నుండి అమరావతికి చేరుకోనున్నారు. రేపు అమరావతి నుండి బయలుదేరి రాజమండ్రిలో జరిగే మహానాడు ప్రాంతానికి వెళ్లనున్నారు. కాగా, గురువారం ఉదయం జమ్మలమడుగు నియోజకవర్గంలోని పెద్దముడియం, పెద్దపసుపుల గ్రామాల మీదుగా లోకేష్ పాదయాత్ర కొనసాగింది. పెద్ద ఎత్తున దళితులు, మైనార్టీలు, రైతులు, మహిళలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రజల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
YS Viveka Case: అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ .. సర్వత్రా ఉత్కంఠ